Apple iOS 17 Update : ఈ నెల 18నే ఆపిల్ iOS 17 కొత్త అప్‌డేట్.. ఈ ఐఫోన్ల జాబితాలో మీ ఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Apple iOS 17 Update : సెప్టెంబర్ 18 నుంచి ఐఓఎస్ 17 కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటుందని ఆపిల్ (Apple) అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్ ప్రారంభంలో డెవలపర్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. కొత్త iOS అప్‌డేట్‌కు అర్హత ఉన్న ఐఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

iOS 17 update to come on Sept 18 _ Check here to see if you will get it on your iPhone or not

Apple iOS 17 Update : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ iOS 17ని జూన్‌లో (WWDC 2023) సమయంలో ప్రకటించింది. అయితే, Messages, FaceTime, విడ్జెట్‌లకు కొత్త అప్‌డేట్ అందించనుంది. ఈ అప్‌డేట్ ఐఫోన్ యూజర్ల కోసం రూపొందించిన అత్యంత ముఖ్యమైన వార్షిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఒకటిగా ఆవిష్కరించింది. ఐఓఎస్ అప్‌డేట్ ప్రారంభంలో iOS 17 లభ్యత డెవలపర్ బీటా టెస్టర్‌లకు మాత్రమే పరిమితం చేసింది. కానీ, ఇప్పుడు కంపెనీ సెప్టెంబర్ 18 నుంచి ఆపిల్ iOS 17 అప్‌డేట్ యూజర్లందరికి అధికారికంగా ప్రకటించింది.

ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా.. కొత్త iOS 17 కొత్త జనరేషన్ సిరీస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఐఫోన్ 14 గత మోడళ్లతో సహా ఇతర ఐఫోన్‌లకు కూడా అందుబాటులో ఉంటుందని ఆపిల్ వెల్లడించింది. వచ్చే వారం ఈ iOS అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు రెడీగా ఉంటుంది.

Read Also : Apple Watch Series 9 : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే.. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్.. కొత్త సెన్సార్లు, మరెన్నో ఫీచర్లు, ధర ఎంతంటే?

iOS 17 అప్‌డేట్‌కు అర్హత కలిగిన ఐఫోన్ల జాబితా :
IOS 17 A12 బయోనిక్ చిప్ లేదా కొత్త వెర్షన్‌తో ఐఫోన్ సపోర్టు ఇస్తుందని గమనించడం ముఖ్యం. 2017లో విడుదలైన iPhone X, iPhone 8, iPhone 8 Plusలకు ఈ ఏడాది అప్‌డేట్‌కు అర్హత ఉండదు. సెప్టెంబర్ 18 నుంచి iOS 17ని స్వీకరించేందుకు అర్హత పొందిన ఐఫోన్ల పూర్తి జాబితాను ఓసారి లుక్కేయండి.

– iPhone 14
– iPhone 14 Plus
– iPhone 14 Pro
– iPhone 14 Pro Max
– iPhone 13
– iPhone 13 mini
– iPhone 13 Pro
– iPhone 13 Pro Max
– iPhone 12
– iPhone 12 mini
– iPhone 12 Pro
– iPhone 12 Pro Max
– iPhone 11
– iPhone 11 Pro
– iPhone 11 Pro Max
– iPhone XS
– iPhone XS Max
– iPhone XR
– iPhone SE (2వ జనరేషన్)

iOS 17 టాప్ ఫీచర్లు ఇవే :
కొత్త iOS 17 అప్‌డేట్ ద్వారా ఐఫోన్లలో మరింత మెరుగ్గా మారుస్తుందని, కొత్త ఫీచర్ల గ్రూపును కలిగి ఉందని ఆపిల్ పేర్కొంది.

స్టాండ్‌బై ఆప్షన్ : iOS 17 స్టాండ్‌బైని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మీ ఐఫోన్‌ను సమాచార కేంద్రంగా మారుస్తుంది. మీ ఐఫోన్ ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు.. లాక్ చేసిన స్క్రీన్‌పైనే టైమ్, లైవ్ యాక్టివిటీలు, ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లు, వివిధ రకాల విడ్జెట్‌లతో సహా కస్టమైజడ్ ఫుల్-స్క్రీన్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.

Apple iOS 17 Update on Sept 18 _ Check here to see if you will get it on your iPhone or not

నేమ్‌డ్రాప్ : iOS 17 మరో వినూత్న ఫీచర్ నేమ్‌డ్రాప్ కలిగి ఉంది. నేమ్‌డ్రాప్‌తో వినియోగదారులు తమ ఐఫోన్‌లను ఒకచోట చేర్చడం ద్వారా కాంటాక్టు డేటాను సులభంగా షేర్ చేసుకోవచ్చు. నేమ్‌డ్రాప్‌ని ఉపయోగించడానికి మీ ఐఫోన్‌ను అవతలి వ్యక్తి ఐఫోన్ లేదా Apple Watch 3 దగ్గరగా పట్టుకోండి.

కొత్త విడ్జెట్‌లు : iOS 17 వినియోగదారులు తమ లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్‌కి ఇంటరాక్టివ్ విడ్జెట్‌లను యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ విడ్జెట్‌లు ఫస్ట్-పార్టీ, థర్డ్-పార్టీ యాప్‌లకు కూడా సపోర్ట్ చేస్తాయి.

FaceTime యాప్‌కి అప్‌డేట్స్ : iOS 17 ఆడియో/వీడియో మెసేజ్‌లను రికార్డ్ చేయడం, పంపడం, వీడియోకు 3D ఎఫెక్ట్‌లను యాడ్ చేయడం, నేరుగా (Apple TV)లో FaceTime కాల్‌ని ఎనేబుల్ చేయడం వంటి వాటితో సహా (FaceTime)కి కొత్త ఫీచర్‌లను అందిస్తుంది.

ఫోన్, మెసేజ్ యాప్‌కి అప్‌డేట్ చేయండి : iOS 17 ఫోన్ యాప్‌లో కస్టమైజడ్ కాంటాక్ట్ పోస్టర్‌లను కూడా యాడ్ చేస్తుంది. వినియోగదారులు తమ కాంటాక్టులకు కాల్ చేసినప్పుడు ఫొటో, మెమోజీ లేదా మోనోగ్రామ్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. లైవ్ వాయిస్‌మెయిల్, తెలియని కాలర్ల సైలంట్ వంటి ఇతర ఫీచర్‌లు కూడా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వస్తాయి.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన WWDC కాన్ఫరెన్స్‌లో కుపెర్టినో-ఆధారిత కంపెనీ iPadOS 17, macOS వెంచురా, watchOS 9, tvOS 16లతో పాటు iOS 17ని ప్రకటించింది. ఆపిల్ కాన్ఫరెన్స్ జూన్ 6 నుంచి జూన్ 10, 2023 వరకు కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని ఆపిల్ పార్క్‌లో జరిగింది.

Read Also : Apple Wonderlust Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్.. భారత్‌లో ఈ 4 ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది.. మీరు వాడే ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు