Apple : అదిరే ఫీచర్లతో iPhone 13 సిరీస్ వచ్చేసిందిగా.. ధర ఎంతంటే?

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ నుంచి 13 సిరీస్ లాంచ్ అయింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ వర్చువల్ లాంచ్ ఈవెంట్లో సరికొత్త ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ రిలీజ్ అయ్యాయి.

iPhone 13, iPhone 13 Pro Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ నుంచి 13 సిరీస్ లాంచ్ అయింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ వర్చువల్ లాంచ్ ఈవెంట్లో సరికొత్త ఐఫోన్ 13 సిరీస్ నాలుగు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. గత ఏడాదిలో ఐపోన్ 12 లైనప్ తర్వాత 2021లో ఐఫోన్ 13 సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయింది. ఈ సిరీస్ ఫోన్ లాంచింగ్ కు ముందే ఫీచర్ల లీకేజీలు, రుమర్లు వినిపించాయి.

నాలుగు మోడళ్లలో వచ్చిన ఐఫోన్ 13 సిరీస్‌లో iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max ఉన్నాయి. ఈ నాలుగు మోడల్స్ ఒకే స్ర్కీన్ సైజు, ఒకే డిజైన్ తో వచ్చాయి. బ్యాటరీ లైఫ్, కెమెరాలు, సినిమాటిక్ వీడియో రికార్డింగ్ మోడ్, నారోర్ నాచ్ వంటి ఉన్నాయి. ఈ నాలుగు ఐఫోన్లలో బ్రాండ్ న్యూ A15 Bionic SoC చిప్ సెట్ ఉండగా.. అన్నింట్లో iOS 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతున్నాయి.
Apple Ipad : వచ్చేస్తోంది.. కొత్త ఐప్యాడ్ మినీ ధర 499 డాలర్లు

iPhone 13 సిరీస్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో iPhone 13, iPhone 13 mini మోడల్స్ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్నాయి. ఐఫోన్ 13 మినీలో 128GB స్టోరేజీ ధర రూ.69,900 ఉండగా, 256GB ధర రూ.79,900, 512GB ధర రూ.99,900, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల ధర రూ.79,900, రూ.89,900, రూ.99,900 ఉన్నాయి. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మూడు స్టోరేజీల్లో 1TB స్టోరేజీ ఆప్షన్లతో వచ్చాయి.

ఐఫోన్ 13 ప్రో ప్రారంభ (128GB) స్టోరేజీ ధర రూ.1,19,900, 256GB స్టోరీజీ ధర రూ.1,29,900, 512GB స్టోరేజీ ధర రూ.1,49,900 ఉండగా 1 TB స్టోరేజీ ధర రూ.1,69,900గా ఉండనున్నాయి. టాప్ లైన్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.1,29,900, రూ.1,39,900, రూ.1,59,900, రూ.1,79,900 వరుసగా ఉండనున్నాయి. ఆపిల్ అత్యంత ఖరీదైన ఐఫోన్లలో ఈ సిరీస్ ఫోన్ ఒకటి.

అమెరికా మార్కెట్లోనూ ఈ ఐఫోన్ 13 సిరీస్ ల్లో iPhone 13 mini ప్రారంభ ధర 699 డాలర్ల నుంచి అందుబాటులో ఉంది. భారత్ సహా అమెరికా, యూకే, చైనా, ఆస్ట్రేలియా, కెనడాలో సెప్టెంబర్ 17 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి రిటైల స్టోర్లల్లో అందుబాటులోకి రానున్నాయి.

స్పెషిఫికేషన్లు ఇవే :
కొత్త ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లలో ఆపిల్ కొత్త A15 Bionic SoC చిప్ సెట్ తీసుకొచ్చింది. 6 కోర్ CPUతో రెండు హై పర్ఫార్మెన్స్, నాలుగు పవర్ ఫుల్ కోర్లలో వచ్చింది. 16-కోర్ Neural Engine మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర మోడళ్లతో పోలిస్తే ఈ సిరీస్ ఫోన్ 50 శాతం బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. iPhone 13, iPhone 13 mini ఫోన్లలో A15 Bionicతో ఫోర్ కోర్ GPU, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఐవ్-కోర్ ఇంటిగ్రేటెడ్ GPUతో వచ్చాయి.

కొత్త ఐఫోన్ 13 సిరీస్ మోడళ్లలో ఆపిల్ కొత్త A15 Bionic SoC చిప్ సెట్ తీసుకొచ్చింది. 6 కోర్ CPUతో రెండు హై పర్ఫార్మెన్స్, నాలుగు పవర్ ఫుల్ కోర్లలో వచ్చింది. 16-కోర్ Neural Engine మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర మోడళ్లతో పోలిస్తే ఈ సిరీస్ ఫోన్ 50 శాతం బెటర్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. iPhone 13, iPhone 13 mini ఫోన్లలో A15 Bionicతో ఫోర్ కోర్ GPU, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఐవ్-కోర్ ఇంటిగ్రేటెడ్ GPUతో వచ్చాయి.

ఆపిల్ ఐఫోన్ ప్రతి మోడల్ బ్యాటరీ కెపాసిటీలు, ర్యామ్ కెపాసిటీ ఎంత అనేది అధికారికంగా కంపెనీ రివీల్ చేయలేదు. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో బ్యాటరీ లైఫ్ 1.5 గంటల పాటు అందిస్తాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 2.5 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ ఫోన్లన్నీ 256GB స్టోరీజీ నుంచి ఆపై అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ 1TB స్టోరేజీతో మొదటిసారిగా రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ ఒకే ఫ్లాట్ ఎడ్జ్ అల్యూమినీయం ఫ్రేమ్స్, ఫ్రంట్ సైడ్ సెరామిక్ షీల్డ్ మెటేరియల్, IP68 డస్ట్, వాటర్ రిసిస్టెన్స్ రేటింగ్ తో వచ్చాయి. ఈ సిరీస్ ఫోన్లు ఐదు కలర్ ఆప్షన్లలో Pink, Blue, Midnight, Starlight, Red అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 13 ప్రో టెలిఫోటో (77 సెం.మీ) 3x ఆప్టికల్ జూమ్, అల్ట్రా-వైడ్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా అన్నీ తక్కువ-కాంతిలోనూ పనిచేస్తుంది. ఆపిల్ ఐఫోన్ 13 ప్రోలో మ్యాక్రో ఫోటోగ్రఫీ, అల్ట్రా-వైడ్ లెన్స్‌ని జూమ్ ఆబ్జెక్ట్‌ ఉపయోగించవచ్చు. ఇందులోని మూడు కెమెరాలు నైట్ మోడ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఆపిల్ ఐఫోన్ 13 కెమెరా అడ్వాన్స్ డ్ గా వచ్చింది. మినీ, రెగ్యులర్ వెర్షన్ రెండింటికి తక్కువ-కాంతిలో అద్భుతంగా పనిచేస్తుంది. కెమెరాలో కొత్త సినిమాటిక్ మోడ్ ఉంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. మీరు ఎక్కడ ఫోకస్ పెడితే అదే హైలెట్ అవుతుంది. పక్కన మొత్తం బ్లర్ అయిపోతుంది. వీడియోలను పోర్ట్రెయిట్ మోడ్ రికార్డు చేసుకోవచ్చు. సినిమా ఫీల్ కంటెంట్‌ను పర్ ఫెక్ట్ గా ఆపిల్ చెప్పింది. డాల్బీ విజన్ HDRతో షూట్ తో స్పెషల్ కస్టమ్ సెన్సార్ ద్వారా పనిచేస్తుంది.
Harm iPhone Cameras : ఐఫోన్ యూజ‌ర్లకు ఆపిల్ వార్నింగ్.. మీ కెమెరాలు భద్రం!

ట్రెండింగ్ వార్తలు