iPhone 13 is available for less than Rs 60,000 during Flipkart Republic Day sale, here is how to buy
Flipkart Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త రిపబ్లిక్ డే సేల్ (Republic Day Sale) కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో అనేక ఐఫోన్‌లపై మంచి భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్‌లలో ఒకటైన ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపు అందిస్తోంది. లేటెస్ట్ ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. 2023లో iPhone డీల్‌ల కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ ఎంచుకుని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 డిస్కౌంట్ డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ రూ. 61,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం క్రోమా (Croma), అమెజాన్ (Amazon), విజయ్ సేల్స్ (Vijay Sales) వంటి అన్ని ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే.. అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఆపిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. iPhone 13 ప్రస్తుత అధికారిక ధర రూ. 69,900గా ఉంది. దీని ప్రకారం.. వినియోగదారులు రూ.7,901 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మునుపటి సేల్ ఈవెంట్‌లలో కూడా తగ్గింపు ధరకే అందించింది.
ఆసక్తిగల కొనుగోలుదారులు ఐఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేల అదనపు తగ్గింపు ఆఫర్ కూడా అందిస్తోంది. దీని ధర రూ.59,999కి తగ్గుతుంది. 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 2300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుత ఫోన్‌ను విక్రయించడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్‌పై ఎప్పుడూ పూర్తి తగ్గింపును ఇవ్వదని గమనించాలి. మీ స్మార్ట్‌ఫోన్ కండిషన్, ఎన్నాళ్లుగా వినియోగిస్తున్నారు అనే ఆధారంగా వాల్యూను కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి.
iPhone 13 is available for less than Rs 60,000 during Flipkart Republic Day sale
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 డీల్ :
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. iPhone 13 మాదిరిగానే..ఇతర ఈ-కామర్స్ సైట్‌లలో అదే డీల్‌ను పొందలేరు. ఎందుకంటే ఈ డివైజ్ అలాంటి వెబ్‌సైట్‌లలో రూ. 70వేల కన్నా ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఐఫోన్‌పై రూ.12,901 భారీ తగ్గింపును అందిస్తోంది. దీనిపై ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 21,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.
iPhone 13 vs iPhone 14 : ఏది కొనాలంటే? :
భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అందుబాటులో లేదు. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13 కొనడంలో పెద్దగా తేడా లేదు. ఎందుకంటే రెండూ చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రాథమిక కెమెరా సెటప్ ఒకే విధంగా ఉంటాయి. మీరు పాత వెర్షన్‌తో పాటు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను కూడా పొందవచ్చు. డిజైన్ పరంగా కూడా ఫోన్ రెండింటినీ తేడా ఉండదు. మీరు iPhone 13ని కొనుగోలు చేయొచ్చు. ఫ్లాగ్‌షిప్ Samsung ఫోన్‌లతో పోలిస్తే.. కెమెరా పనితీరు అంత గొప్పగా లేదనే చెప్పాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..