iPhone 13 Big Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై బిగ్ డిస్కౌంట్.. తొందరపడి ఇప్పుడే కొనొద్దు.. ఎందుకో తెలుసా?
iPhone 13 Big Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ 13 (iPhone 13)పై మళ్లీ భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి.

iPhone 13 gets big discount on Amazon and Flipkart, but don’t buy it right now
iPhone 13 Big Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్ 13 (iPhone 13)పై మళ్లీ భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Sale) ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale)లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ రూ.8,901 తగ్గింపును పొందింది. అధికారిక Apple వెబ్‌సైట్‌లో iPhone 13 ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 60,999తో లిస్టు అయింది. రిటైల్ ధర రూ. 69,900గా ఉంది. ఆపిల్ ఐఫోన్ ప్రియులు ఈ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ప్రస్తుతం iPhone 13ని తొందరపడి కొనుగోలు చేయకపోవడమే మంచిది.
ఎందుకంటే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ తమ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ సేల్ ఈవెంట్‌లను ప్రకటించాయి. జనవరి 15న ఈవెంట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale)ను ఒక రోజు ముందుగానే యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాథమికంగా జనవరి 14న అమెజాన్‌లో iPhone 13పై భారీ డిస్కౌంట్ అందించనున్నాయి.

iPhone 13 gets big discount on Amazon and Flipkart
మరోవైపు, ఆపిల్ కొత్త ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus)లను అత్యంత తక్కువ ధరలకు విక్రయించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ 5G ఫోన్‌లు సేల్ సమయంలో భారీ తగ్గింపును పొందుతాయని చెబుతోంది. ఐఫోన్ 14 డీల్ రూ. 6X,XXX నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్‌లో ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ 13 మాదిరిగానే వినియోగదారులు ఐఫోన్ 14 లేటెస్ట్ వెర్షన్‌ను ఐఫోన్ 13 ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందుకే కస్టమర్‌లు మరో రోజు వరకు వేచి ఉండటమే బెటర్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం, ఐఫోన్ 14 (128GB స్టోరేజ్) మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.73,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 79,900గా ఉంది. కంపెనీ ఇప్పటికే డిస్కౌంట్ ధరతో ఆఫర్ చేస్తోంది. కానీ, కొనుగోలుదారులు ఐఫోన్ 14ను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఐఫోన్ 14 సిరీస్ డీల్ నచ్చకపోతే.. వినియోగదారులు కనీసం ఐఫోన్ 13పై కూడా భారీ తగ్గింపు పొందవచ్చు.

iPhone 13 gets big discount on Amazon and Flipkart
ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ ఒకే కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లు.. రెండింటి మధ్య పెద్దగా తేడాలు లేవు. రెండు హ్యాండ్‌సెట్‌లు ఒకే చిప్‌సెట్‌తో వస్తాయి, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రాథమిక కెమెరా సెటప్ ఒకేలా ఉంటాయి. మీరు పాత వెర్షన్‌తో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా పొందవచ్చు. డిజైన్ పరంగా కూడా రెండింటినీ వేరు చేయడం కష్టమే. రెండు 5G ఐఫోన్‌ల మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే.. కొత్తది ఎమర్జెన్సీ శాటిలైట్ ఫీచర్‌తో వస్తుంది. కానీ, ప్రస్తుతానికి ఈ సరికొత్త ఫీచర్ భారత్‌లోని ఐఫోన్ యూజర్లకు పనిచేయదని గమనించాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..