Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 నుంచి సేల్ ప్రారంభమై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ మెగా సేల్‌లో ఐఫోన్ 13 రూ. 50వేల లోపు ధరకే ఆఫర్ చేస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Amazon Great Republic Day Sale : సరికొత్త ఐఫోన్‌ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభమై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ మెగా సేల్‌లో ఐఫోన్ 13 గణనీయమైన ధర తగ్గింపును పొందవచ్చు. బహుశా రూ. 50వేల మార్కు కన్నా తక్కువగా ఉంటుంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 13 గణనీయంగా ధర తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ధర రూ. 52,999 నుంచి కేవలం రూ. 49,999కే కొనుగోలు చేయొచ్చు.

Read Also : Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్ డిజైన్, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్.. పూర్తి వివరాలు మీకోసం..!

ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేయడం, ఈఎంఐ లావాదేవీలను ఎంచుకోవడం ద్వారా అదనంగా రూ. 1,000 ధర తగ్గింపు పొందవచ్చు. తద్వారా డీల్‌ రూ. 48,999కు సొంతం చేసుకోవచ్చు. మీ దగ్గర పాత హ్యాండ్‌సెట్ ఉంటే.. ఐఫోన్ 13 మోడల్ రూ. 22,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో కొన్ని అద్భుతమైన ఆఫర్‌లు ఉండవచ్చు. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే సరైన సమయం.

ఐఫోన్ 13 కొనుగోలు చేయాలా? వద్దా? :
2024లో ఐఫోన్ 13 కొనుగోలు చేయడం సరైనదేనా? ఐఫోన్ 15 అందుబాటులో ఉండగా.. ఇప్పటికీ ఐఫోన్ 13 అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. అయినప్పటికీ, దీని డిజైన్ పెద్దగా మారలేదనే చెప్పాలి. కొత్త మోడళ్లలో హై-రిఫ్రెష్ రేట్ లేదు. ప్రత్యేక టెలిఫోటో లెన్స్‌లతో కూడిన ఫోన్‌ మాదిరిగా జూమ్‌లు ఆకట్టుకోలేవు. కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే.. ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Amazon Great Republic Day sale

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ 146.7×71.5×7.65 మిమీ కొలతలు, 173 గ్రాముల బరువు కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 460 పీపీఐ పిక్సెల్ సాంద్రతను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే హెచ్‌డీఆర్, డిస్‌ప్లే పీ3 సర్టిఫికేట్ పొందింది. 1200నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని పొందుతుంది.

ఐఫోన్ 13 మోడల్ ఎ15 బయోనిక్ చిప్‌సెట్, 5ఎన్ఎమ్, 6-కోర్ సీపీయూ ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా ఎఫ్/1.6 ఎపర్చరును కలిగి ఉంది. ఇందులో 12ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు ఎఫ్/2.4 ఎపర్చరు, 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఉన్నాయి. ఐఫోన్ 13 కెమెరాలు డాల్బీ విజన్‌కు సపోర్టుతో 4కె 60ఎఫ్‌పీఎస్‌ హెచ్‌‌‌డీఆర్ వీడియోలను క్యాప్చర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

ట్రెండింగ్ వార్తలు