iPhone 14 Plus India sale starts this week, but it will take weeks to deliver
iPhone 14 Plus India Sale : ప్రముఖ ఆపిల్ (Apple) కొత్త ఐఫోన్‌పై భారీ సేల్ ప్రారంభం కానుంది. ఈ వారమే భారత మార్కెట్లో Apple కొత్త iPhone 14 Plus మోడల్‌పై సేల్ మొదలు కానుంది. భారీ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఐఫోన్ ప్లస్ అక్టోబర్ 7 (శుక్రవారం) భారత మార్కెట్లో సేల్‌కు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఈ ఫోన్ Apple అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రీ-సెల్లర్‌ల ద్వారా ప్రీ-బుక్ చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ కొత్త 14 ప్లస్ వేరియంట్‌ను రియల్ సేల్ తేదీలో కొనుగోలు చేసే సాధారణ కస్టమర్‌లు డెలివరీకి మాత్రం కొన్ని వారాలపాటు (ఢిల్లీ, ముంబై పిన్ కోడ్) వేచి ఉండాల్సి ఉంటుంది.
Apple ఇండియా వెబ్‌సైట్ 21 రోజుల (మూడు వారాలు) వరకు డెలివరీ సమయాన్ని చూపిస్తుంది. మరో ఫ్లిప్‌కార్ట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రెండు రోజుల డెలివరీ సమయాన్ని చూపిస్తుంది. ప్రీ-బుక్ కస్టమర్‌లకు అవకాశం ఉంది. రియల్ సేల్ ప్రారంభమైన తర్వాత కొత్త స్టాక్‌లు వచ్చే వరకు కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లో ఆర్డర్‌లను నిలిపేయవచ్చు. ఇందుకు మళ్లీ వారాలు పట్టవచ్చు. సెప్టెంబరులో సేల్స్ ప్రారంభమైనప్పుడు iPhone 14 Pro, 14 Pro Max మోడళ్లతో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు iPhone 14 సేల్ సమయంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొలేదు.
iPhone 14 Plus India sale starts this week, but it will take weeks to deliver
ఢిల్లీ, ముంబైలోని కొంతమంది అధికారిక రీ-సెల్లర్‌లు సైతం.. వినియోగదారులు MRPలో 2 శాతం అడ్వాన్స్‌గా చెల్లించి వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా డివైజ్‌లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చనని చెబుతున్నారు. స్టాక్‌కు సంబంధించిన వివరాలపై ఎలాంటి క్లారిటీ లేదు. సాధారణ కస్టమర్ల కోసం స్టాక్‌లు రియల్ సేల్ డేట్ అక్టోబర్ 7న అందుబాటులో ఉంటాయో లేదో ధృవీకరించలేదు. iPhone 14 Plusని ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్‌లకు ముందుగా స్టాక్‌లు సిద్ధంగా ఉంటాయని అధికారి తెలిపారు. కొన్ని సందర్భాల్లో.. సాధారణ కస్టమర్లకు స్టాక్‌లకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. డెలివరీ వెనుక కారణాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి.
ఐఫోన్ 14 ప్లస్ ప్రీ-బుక్ ఆర్డర్‌లు పెద్దగా లేవని, ఐఫోన్ 13 మినీ ఉత్పత్తి తగ్గించవచ్చని ఆపిల్ విశ్లేషకులు పేర్కొన్నారు. చైనీస్ బ్లాగ్ ITHome కొత్త నివేదిక ప్రకారం.. ఐఫోన్ 14 ప్లస్ డిమాండ్ లాంచ్ పెరిగిందని పేర్కొంది. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, 14 ప్రో సిరీస్‌లతో పాటు లాంచ్ అయింది. పెద్ద స్క్రీన్‌తో మెరుగైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. గత ఏడాది వరకు, iPhone 14 Pro Max మాత్రమే పెద్ద స్క్రీన్‌ను అందించింది. కానీ, దీని ధర చాలా ఎక్కువగా ఉంది. భారత మార్కెట్లో కొత్త iPhone 14 Plus ధర రూ. 89,900 (128GB) నుంచి మొదలై రూ. 1,19,900 (512GB) వరకు ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..