iPhone 14 Plus First Sale : వచ్చేవారమే భారత్‌లో ఐఫోన్ 14 Plus ఫస్ట్ సేల్.. ఇంతకీ ఈ ఐఫోన్ విలువైనదేనా? కొనాలా? వద్దా?

iPhone 14 Plus First Sale : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) మొదటిసారి వచ్చే వారం (అక్టోబర్ 7న) సేల్‌కు అందుబాటులోకి రానుంది. iPhone 14 సిరీస్‌లోని ఇతర డివైజ్‌లు ఇప్పటికే కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయి.

iPhone 14 Plus First Sale : వచ్చేవారమే భారత్‌లో ఐఫోన్ 14 Plus ఫస్ట్ సేల్.. ఇంతకీ ఈ ఐఫోన్ విలువైనదేనా? కొనాలా? వద్దా?

iPhone 14 Plus first sale in India next week, is it worth buying

iPhone 14 Plus First Sale : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) మొదటిసారి వచ్చే వారం (అక్టోబర్ 7న) సేల్‌కు అందుబాటులోకి రానుంది. iPhone 14 సిరీస్‌లోని ఇతర డివైజ్‌లు ఇప్పటికే కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్ అనేది ప్రో మోడల్స్‌తో పోలిస్తే.. తక్కువ ధరలో స్టాండర్డ్ వెర్షన్ కన్నా భారీ స్క్రీన్, పెద్ద బ్యాటరీతో వస్తోంది.

ఆపిల్ ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన కొత్త మోడల్ కూడా. ఐఫోన్ 14 ప్లస్ 128GB స్టోరేజ్ మోడల్‌కు ప్రారంభ ధర రూ.89,990గా ఉంది. 256GB + 512GB స్టోరేజ్ మోడల్స్ కావాలనుకునే వారు వరుసగా రూ.99,900, రూ.1,19,900 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ప్లస్ మోడల్‌కు సంబంధించిన ఆఫర్‌లు వచ్చే వారం ఎప్పుడు సేల్ అందుబాటులోకి వస్తాయో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) భారత మార్కెట్లో కొనేందుకు విలువైనదేనా? లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 14 Plus first sale in India next week, is it worth buying

iPhone 14 Plus first sale in India next week, is it worth buying

వచ్చే వారం భారత్‌లో iPhone 14 Plus ఫస్ట్ సేల్..
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్‌లతో పోలిస్తే.. పెద్ద డిస్‌ప్లేతో పాటు బ్యాటరీతో ఐఫోన్‌ను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. ప్లస్ వేరియంట్ భారీ ధరతో వచ్చింది. భారత మార్కెట్లో దాదాపు రూ. 90వేల ఖర్చు చేసిన పొందడం కష్టమే. ఈ డివైజ్ ఐఫోన్ 14 మోడల్ కన్నా ఎక్కువ ధరను కలిగి ఉంది.

ఈ ధరలో రూ.10వేల వరకు వ్యత్యాసం ఉంది. రెండు ఫోన్‌లు ఒకే విధమైన ఫీచర్లు కలిగి ఉన్నాయి. ప్రధాన వ్యత్యాసం డిస్‌ప్లేలోనే ఉంది. ప్లస్ మోడల్ 6.7-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. అయితే ప్రైమరీ వెర్షన్ 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చింది. బ్యాటరీ మినహా మిగిలిన ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి.

iPhone 14 Plus first sale in India next week, is it worth buying

iPhone 14 Plus first sale in India next week, is it worth buying

ప్లస్ వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ ఉందని ఆపిల్ పేర్కొంది, కానీ పెద్ద తేడా లేదని చెప్పవచ్చు. వీడియో ప్లేబ్యాక్ స్ట్రీమింగ్ పరంగా గరిష్టంగా 20 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని చెప్పవచ్చు. ఐఫోన్ 14 మోడల్16 గంటలు ఛార్జింగ్ డెలివరీ ఇస్తుంది. Apple ప్రకారం.. రెండు మోడళ్ల మధ్య కేవలం 4 గంటల తేడా మాత్రమే ఉంది. ఐఫోన్ 14 ప్లస్‌ను మరిచిపోండి.. రెగ్యులర్ వెర్షన్ కూడా అంతగా విలువైనది కాదనే చెప్పాలి. దీపావళి సేల్స్ సమయంలో చాలా తక్కువ ధరకు ఐఫోన్ 13 మాదిరిగానే అందుబాటులో ఉండనుంది.

ఫ్లిప్‌కార్ట్ ఈ మోడల్ ఐఫోన్ ధరను రూ. 58,900కి అందిస్తోంది. ఐఫోన్ 14 ధర భారత మార్కెట్లో అధికారికంగా రూ.79,900లకు అందుబాటులో ఉంది. ప్లస్ మోడల్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్‌లు రూ. 10వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే పాత A15 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నాయి. కెమెరా సెటప్, డిజైన్ కూడా ఒకేలా ఉన్నాయి. కొంచెం పెద్ద బ్యాటరీ, స్క్రీన్‌ మాత్రమే ఈ డివైజ్‌లో వచ్చేది. అందుకే గత ఏడాదిలో మోడల్‌ ఎంచుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Features : ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 13 ఒకేలా లేవు.. ఫ్రంట్ డిజైన్ సేమ్.. ఇంటర్నల్‌గా బిగ్ ఛేంజ్..!