Flipkart Discount Sale : ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్.. ఐఫోన్ 15, గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..!

Flipkart Discount Sale : ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8 వంటి పాపులర్ మోడల్‌లు రికార్డ్-బ్రేకింగ్ డిస్కౌంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

iPhone 15, Google Pixel 8, Samsung Galaxy S24 Plus

Flipkart Discount Sale : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వైడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మొబైల్స్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు ఫ్లాగ్‌షిప్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను భారీ తగ్గింపుతో అందిస్తుంది. మీ హ్యాండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఇదే సరైన సమయం కావచ్చు.

ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8 వంటి పాపులర్ మోడల్‌లు రికార్డ్-బ్రేకింగ్ డిస్కౌంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదనపు సేవింగ్స్ కోసం బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ :
ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రీమియం ఆప్షన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ తగ్గింపు ధరకు అందిస్తోంది. 256జీబీ మోడల్ అసలు ధర రూ. 99,999, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,999 వద్ద జాబితా అయింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు సేవింగ్స్ పొందవచ్చు.

రియల్‌మి 13 ప్రో ప్లస్ :
మిడ్ రేంజ్ విభాగంలో ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలు, పర్ఫార్మెన్స్, సరసమైన ధర, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి రియల్‌మి 13 ప్రో ప్లస్ బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది. 256జీబీ మోడల్ ప్రారంభ ధర రూ. 36,999 ఉండగా, ఇప్పుడు రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 మోడల్ అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో సేల్ సమయంలో భారీ ధర తగ్గింపును కలిగి ఉంది. 128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 69,900, ఇప్పుడు రూ. 57,999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ డీల్‌ను మరింత తగ్గించేందుకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌ల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

మోటరోలా ఎడ్జ్ 50 :
మోటరోలా ఎడ్జ్ 50 ఫీచర్-రిచ్ ఫోన్. 256జీబీ వేరియంట్ ధర రూ. 32,999 ఉంటుంది. ప్రస్తుతం తగ్గింపు ధరతో రూ. 27,999కి అందుబాటులో ఉంది. మరింత సేవ్ చేసేందుకు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. పవర్‌ఫుల్ టెన్సర్ జీ3 చిప్, ఏఐ-ఆధారిత ఫీచర్ల సూట్‌తో కూడిన పిక్సెల్ 8 భారీ డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ సిరీస్‌ 256జీబీ వేరియంట్‌ అసలు ధర రూ. 82,999 ఉండగా, ఇప్పుడు రూ. 44,999కి విక్రయించనుంది.

అప్‌గ్రేడ్ సరైన సమయం ఇదేనా? :
ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది. వివిధ బ్రాండ్‌లు, ఇతర కేటగిరీలలో గణనీయమైన డిస్కౌంట్లతో పాటు సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్లు, వినియోగదారులు ఈ ఆఫర్‌లు ఉన్నంత వరకు ఉపయోగించుకోవచ్చు.

Read Also : JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 దరఖాస్తు గడువు తేదీ పొడిగించేది లేదు.. ఈ నెల 22లోగా అప్లయ్ చేసుకోండి!