JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 దరఖాస్తు గడువు తేదీ పొడిగించేది లేదు.. ఈ నెల 22లోగా అప్లయ్ చేసుకోండి!
JEE Main 2025 : ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2025 జనవరి, ఏప్రిల్ అనే 2 సెషన్లలో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2025 జనవరి పరీక్షను తాత్కాలికంగా జనవరి 22 నుంచి జనవరి 31, 2025 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు.

JEE Main 2025
JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 దరఖాస్తు గడువు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జేఈఈ మెయిన్ దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ తేదీ అంటే.. నవంబర్ 22, 2024న ముగియనుంది. జేఈఈ మెయిన్ 2025 ఎన్‌టీఏ ఎడిటింగ్ విండోను ఓపెన్ చేస్తుంది.
నవంబర్ 26న దరఖాస్తు చేసుకోండి. జేఈఈ అభ్యర్థులు నవంబర్ 27న రాత్రి 11.50 గంటల వరకు అనుమతించే ఫీల్డ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం.. అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, పర్మినెంట్/కరెంట్ అడ్రస్, ఎమర్జెనీ కాంటాక్టు వివరాలు, ఫోటోగ్రాఫ్‌లను మార్చేందుకు అనుమతి ఉండదు.
అభ్యర్థులు ఈ కింది వివరాలలో దేనినైనా మార్చవచ్చు :
– పేరు
– తల్లి పేరు
– తండ్రి పేరు
అభ్యర్థులు ఈ ఫీల్డ్‌లన్నింటినీ మార్చేందుకు అనుమతి ఉంటుంది.
-10వ తరగతి/తత్సమాన వివరాలు
-12వ తరగతి/తత్సమాన వివరాలు
-పాన్ నంబర్
– పుట్టిన తేదీ
– లింగం
– కేటగిరీ
-సబ్ కేటగిరీ
– పీడబ్ల్యూడీ స్టేటస్
– సిగ్నేచర్
ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2025 జనవరి, ఏప్రిల్ అనే 2 సెషన్లలో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2025 జనవరి పరీక్షను తాత్కాలికంగా జనవరి 22 నుంచి జనవరి 31, 2025 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు.
జేఈఈ మెయిన్ 2025 ఎలా దరఖాస్తు చేయాలి? :
- జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in) లో నవంబర్ 22, 2024లోపు కింది ఇచ్చిన విధంగా దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
- అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో “జేఈఈ (మెయిన్) కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2025 సెషన్-1” లింక్‌పై క్లిక్ చేయండి
- ఇప్పుడు “కొత్త రిజిస్ట్రేషన్” ట్యాబ్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలతో రిజిస్టర్ చేసుకోండి
- ఇప్పుడు జనరేట్ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
- దరఖాస్తు రుసుము చెల్లించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
- దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దగ్గర ఉంచుకోండి.