iPhone 15 Pro Models : రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఐఫోన్ 14 ప్రో కన్నా చాలా ఖరీదైనవి.. రూ.17వేలు ఎక్కువ ఉండొచ్చు..!

iPhone 15 Pro Models : రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు ప్రస్తుత ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కన్నా చాలా ఖరీదైనవిగా అంచనా. ధరల పెరుగుదల 100 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంటుంది. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌ ధరలను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.

iPhone 15 Pro models may cost Rs 17,000 more than iPhone 14 Pro models, reports reveal

iPhone 15 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్స్ రానున్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌ల కన్నా చాలా ఖరీదైనవిగా ఉండనున్నాయి. అంటే.. దాదాపు రూ. 17వేలు ఎక్కువ ఖర్చవుతాయి. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేయడానికి ఇంకా 2 నెలల దూరంలో ఉంది. అయితే, ఐఫోన్ అంచనా ధర, స్పెక్స్, డిజైన్, మరెన్నో ఆసక్తికరమైన నివేదికలు ఉన్నాయి.

ఐఫోన్ 14 సిరీస్ కన్నా ఈ డివైజ్ చాలా ఖరీదైనదని నివేదిక సూచించింది. ఐఫోన్ 15 సిరీస్ వనిల్లా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ సెప్టెంబరులో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏదేమైనా, బార్క్లేస్ విశ్లేషకుడు దావా ప్రకారం.. ఈ ఏడాదిలో ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు గత ప్రో మోడల్‌ల కన్నా ఖరీదైనవి కావచ్చు.

Read Also : Motorola G62 5G : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా G62 5G ఫోన్‌పై బెస్ట్ ఆఫర్లు, 29శాతం డిస్కౌంట్.. డోంట్ మిస్..!

మాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు కొనసాగుతున్న ఐఫోన్ 14 ప్రో మోడల్‌లతో పోలిస్తే.. అధిక ధర ట్యాగ్‌తో వస్తాయని అంచనా. ఐఫోన్ 15 Pro ధర ఐఫోన్ 14 Pro కన్నా దాదాపు 100 డాలర్లు (సుమారు రూ. 9,000) ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఐఫోన్ 15 Pro Max ధర iPhone 14 Pro Maxతో పోలిస్తే.. 100 డాలర్ల నుంచి 200 డాలర్లు (సుమారు రూ. 17వేలు) వరకు పెరగవచ్చు. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్‌లు గత వెర్షన్ల మాదిరిగానే అదే ధరను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

iPhone 15 Pro models may cost Rs 17,000 more than iPhone 14 Pro models, reports reveal

అమెరికాలో ఐఫోన్ 14 ప్రో మోడల్ 999 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం అత్యంత ఖరీదైన ఐఫోన మోడల్ అయిన iPhone 14 Pro Max ధర 1,099 డాలర్లు ఉండనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో మోడల్ 1,099 డాలర్ల వద్ద ప్రారంభం కానుంది. అయితే ఐఫోన్ 15 Pro Max ప్రారంభ ధర 1,199 డాలర్లు లేదా 1,299 డాలర్లు కూడా ఉండవచ్చు. వనిల్లా ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లతో ప్రవేశపెట్టింది. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ అమెరికాలో 899 డాలర్ల వద్ద ప్రారంభమైంది.

గతంలో ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుత ఐఫోన్ 14 ప్రో మాక్స్ కన్నా ఎక్కువ ధర ఉంటుందని పేర్కొన్నారు. కొత్త పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఫ్రేమ్‌లు, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన సాలిడ్-స్టేట్ బటన్‌లు, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌లు, సరికొత్త A17 బయోనిక్ చిప్, పెరిగిన ర్యామ్‌తో సహా వివిధ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ ధర పెరుగుదల అవకాశం ఉంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక కూడా ఐఫోన్ 15 ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే.. ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చని పేర్కొంది. ఆపిల్ ఆదాయాన్ని పెంచుకోవడానికి 2023 ఐఫోన్ మోడల్స్ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది దాదాపు 85 మిలియన్ల ఐఫోన్ 15 యూనిట్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టిన నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్.. నెలకు రూ.50 లక్షల జీతమట.. అదేలా సాధ్యం.. అతడేం చేశాడో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు