iPhone 15 will be on sale effectively at Rs 48,900, but terms and conditions apply_ Here are the details
Apple iPhone 15 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ 15 (iPhone 15) సెప్టెంబర్ 22న మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. భారత మార్కెట్లో ఐఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, కొంతమంది కొత్త ఐఫోన్‌ను వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అవును.. ఇది నిజమే.. భారత (iStore)లో కొత్త ఐఫోన్ 15ని రూ. 48,900 ప్రభావవంతమైన ధరకు విక్రయించనుంది. అయితే ఈ ఆఫర్ కొన్ని నిబంధనలు, షరతులపై అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఆపిల్ స్టోర్‌లో ధర ఎంతంటే? :
కొత్త ఐఫోన్ 15 ధర అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే విధంగా ఉంటుంది. బేస్ 128GB ఉన్న ఐఫోన్ 15 ధర రూ. 79,900, 256GB మోడల్ ధర రూ. 89,900కి విక్రయించనుంది. 512GB వెర్షన్ యూజర్లకు రూ.1,09,900 ధరకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 15 ప్రభావవంతంగా ధర రూ. 48,900కి విక్రయించనుంది. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపిల్ అధీకృత ఆఫ్‌లైన్ రిటైలర్ (India iStore), కొత్త ఐఫోన్ 15ని రూ. 50వేల కన్నా తక్కువ ధరకే అందిస్తోంది.
ఈ డీల్‌లో అనేక డిస్కౌంట్ ఆఫర్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15 ఇండియా ఐస్టోర్ ద్వారా రూ.79,900కి అందుబాటులో ఉంటుంది. అయితే, మీరు HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్లు చేస్తే.. ఈ స్టోర్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. మీరు రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. తద్వారా ఐఫోన్ 15 ధరను రూ.74,900కి తగ్గించింది.
Apple iPhone 15 Sale effectively at Rs 48,900, but terms and conditions apply
ఇప్పుడు, ఐఫోన్ 12ని కలిగి ఉన్న యూజర్లు కంపెనీ ట్రేడ్-ఇన్ ఆఫర్‌లో భాగంగా రూ. 20వేల అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ ఆఫర్‌ను క్లెయిమ్ చేసేందుకు ఐఫోన్ మంచి కండిషన్‌లో ఉండాలని స్టోర్ స్పష్టంగా పేర్కొంది. దీనికి అదనంగా రూ.6వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. రెండు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కలిపి ధర ప్రభావవంతంగా రూ. 48,900కి పడిపోతుంది. లేటెస్ట్ ఆఫర్ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటుంది. మీ పాత ఐఫోన్ 12 ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని భావిస్తున్నారా?
మీ iPhone లేదా Android స్మార్ట్‌ఫోన్ ధరను Cashifyలో లేదా భారత iStore అధికారిక వెబ్‌సైట్‌లో ఎంత తగ్గింపు ఉంటుందో చెక్ చేసుకోండి. అదే బ్యాంక్ ఆఫర్ ఆపిల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి వినియోగదారులు రూ.2వేల నుంచి రూ.67,800 వరకు ట్రేడ్-ఇన్ డిస్కౌంట్ పొందవచ్చు. లేటెస్ట్ iPhone 15 స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ డీల్‌ను పొందడానికి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను చెక్ చేసుకోవచ్చు.
Read Also : WhatsApp for iPad : ఇది విన్నారా? ఐప్యాడ్‌లోనూ వాట్సాప్ సర్వీసులు.. ఈ కొత్త యాప్ ఎలా వాడాలంటే?