Apple iPhone 15 Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 15 Offers : ఆపిల్ iPhone 15 సిరీస్ ఆపిల్ స్టోర్ల నుంచి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ లైనప్‌తో పాటు ఐఫోన్ 14, ఐపోన్ 14 ప్లస్ కొనుగోలుపై అనేక డిస్కౌంట్‌లు, ట్రేడ్-ఇన్ ఆఫర్‌లను పొందవచ్చు.

Apple iPhone 15 Offers : ఆపిల్ ఐఫోన్ 15 కొనేందుకు చూస్తున్నారా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!

Looking to buy the Apple iPhone 15_ Check online and in-Store offers now available

Apple iPhone 15 Offers : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఆపిల్ iPhone 15 సిరీస్ అతి త్వరలో గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 22 (శుక్రవారం) నుంచి కేవలం 3 రోజుల వ్యవధిలో ఐఫోన్లను ముందస్తుగా ఆర్డర్ చేసుకోవచ్చు. కొనుగోలుదారులు ఫిజికల్ ఆపిల్ స్టోర్‌లను (BKC, ముంబై, ఢిల్లీలో సాకేత్) రెండింటినీ విజిట్ చేయొచ్చు.

అలాగే ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్‌లో కూడా ఐఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 లైనప్ మాత్రమే కాకుండా, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13, ఐఫోన్ SE, అలాగే Apple Watch Ultra 2, Apple Watch Series 9, Apple Watch SEలను కూడా కొనుగోలు చేయవచ్చు. అద్భుతమైన డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ డీల్‌ల బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు డబ్బు ఆదా చేసుకోవడానికి బెస్ట్ ఆఫర్లను చెక్ చేసుకోండి.

Read Also : WhatsApp AI Stickers : వాట్సాప్ ఏఐ స్టిక్కర్లు.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఆపిల్ స్టోర్, ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆఫర్లు :
ఆపిల్ స్టోర్, ఆన్‌లైన్, ఫిజికల్ స్టోర్‌లు ఐఫోన్లు లేదా ఆపిల్ వాచ్ కోసం చెల్లించడానికి వేర్వేరు ఆప్షన్లను కలిగి ఉంటాయి. మీరు అదనపు డిస్కౌంట్ల కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను కూడా ఎంచుకోవచ్చు. దాంతో పాటు, ప్రొడక్టులను కొనుగోలు చేసేటప్పుడు 3 లేదా 6 నెలల పాటు నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

ఇంకా, మీరు ధరను మరింత తగ్గించడానికి ట్రేడ్-ఇన్ క్రెడిట్‌లను ఉపయోగించవచ్చు. రూ. 6వేల విలువైన ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లో విలువైన ఇన్‌స్టంట్ సేవింగ్ పొందవచ్చు. ఐఫోన్ 15, 15 ప్లస్‌లపై రూ. 5000, ఐఫోన్ 14, 14 ప్లస్‌లపై రూ. 4000, ఐఫోన్ 13పై రూ. 3000, మీరు అర్హత గల HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించినప్పుడు iPhone SEలో రూ. 2000 పొందవచ్చు.

Looking to buy the Apple iPhone 15_ Check online and in-Store offers now available

Looking to buy the Apple iPhone 15_ Check online and in-Store offers now available

అదేవిధంగా, రూ.3వేలు ఆపిల్ వాచ్ అల్ట్రా 2పై ఇన్‌స్టంట్ సేవింగ్, ఆపిల్ వాచ్ సిరీస్ 9పై రూ. 2500, అర్హత కలిగిన HDFC బ్యాంక్ కార్డ్‌లపై ఆపిల్ వాచ్ SEలో రూ. 1500వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు కొనుగోలు చేసేటప్పుడు 3 లేదా 6 నెలల నో-కాస్ట్ EMIని ఎంచుకోవచ్చు. ధరను మరింత తగ్గించడానికి, ఆపిల్ అందించే ట్రేడ్-ఇన్ డీల్‌లకు కూడా ఎంచుకోవచ్చు. మీరు ఇన్‌స్టంట్ క్రెడిట్‌లను పొందడానికి మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.

ఆపిల్ ట్రేడ్-ఇన్ ఎలా పనిచేస్తుందంటే? :
1. మీ డివైజ్ వాల్యూ ఏంటో చూసేందుకు ఆపిల్ వెబ్‌సైట్ ని విజిట్ చేయండి.
2. మీ అంచనా ట్రేడ్-ఇన్ వాల్యూను పొందడానికి మీ కొత్త డివైజ్ ఎంచుకుని, ఆపై కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
3. మీ కొత్త ఐఫోన్‌ సేవ్ చేయడానికి మీరు ఆ వాల్యూను ఇన్‌స్టంట్ క్రెడిట్‌గా ఉపయోగించవచ్చు.
4. డోర్‌స్టెప్ పికప్, డెలివరీ అందుబాటులో ఉంది.
5. మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ కొత్త ఐఫోన్ డెలివరీ అయినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోండి.

Read Also : Jio AirFiber Services : జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసిందోచ్.. 8 నగరాల్లో అందుబాటులోకి.. కేబుల్ లేకుండా అల్ట్రా హైస్పీడ్ సర్వీసులు.. పూర్తి వివరాలు మీకోసం..!