WhatsApp AI Stickers : వాట్సాప్ ఏఐ స్టిక్కర్లు.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp AI Stickers : వాట్సాప్ కొత్త ఫీచర్ (AI) వచ్చేసింది. కస్టమైజ్ చేసిన స్టిక్కర్‌లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది.

WhatsApp AI Stickers : వాట్సాప్ ఏఐ స్టిక్కర్లు.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to Create AI-Generated Stickers on WhatsApp_ Steps to Follow

WhatsApp AI Stickers : ప్రముఖ వాట్సాప్ బీటా (Whatsapp Beta) ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో AI స్టిక్కర్‌లకు సపోర్టును అందిస్తోంది. వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించే ఫస్ట్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో AI స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.23.17.14 అప్‌డేట్ (WhatsApp) బీటాలో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్ AI ద్వారా కస్టమైజ్ చేసిన స్టిక్కర్‌లను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త AI ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Read Also : Vivo Y100 5G Series : వివో Y100 5G సిరీస్ ధర తగ్గిందోచ్.. ఏ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

ఫీచర్ ట్రాకర్ (WABetaInfo) నివేదికలో కొత్త అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో టెస్టర్‌లకు అందుబాటులో ఉందని పేర్కొంది. అన్ని ఇతర స్టిక్కర్‌ల మాదిరిగానే, AI రూపొందించిన స్టిక్కర్ల ఫీచర్ స్టిక్కర్‌ల ట్యాబ్‌లో ఉంది. స్టిక్కర్‌ను రూపొందించే వినియోగదారులు కొత్త క్రియేట్ బటన్‌ను ట్యాప్ చేయాలి.

How to Create AI-Generated Stickers on WhatsApp_ Steps to Follow

WhatsApp AI Stickers : How to Create AI-Generated Stickers on WhatsApp_ Steps to Follow

వాట్సాప్‌లో AI స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలంటే? :
* వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఏదైనా చాట్‌ని ఓపెన్ చేసి దానిపై క్లిక్ చేయండి.
* చాట్‌లో, స్టిక్కర్‌ల విండోను ఓపెన్ చేసేందుకు దిగువన ఉన్న స్మైలీ ఐకాన్ ఎంచుకోండి.
* మీరు AI స్టిక్కర్‌లను క్రియేట్ చేయడానికి యాక్సెస్‌ని పొందిన తర్వాత, మీ సొంత AI స్టిక్కర్‌ని క్రియేట్ చేయండి.ఆ తర్వాత ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
* ‘Create’ ఎంచుకోండి. మీరు క్రియేట్ చేయాలనుకునే స్టిక్కర్ వివరాలను వివరించండి.
* ఈ కొత్త ఫీచర్ మీ వివరణ ఆధారంగా మీకు విభిన్న ఆప్షన్లను అందిస్తుంది.
* AI స్టిక్కర్ క్రియేట్ యూజర్ అందించిన వివరణపై ఆధారపడి ఉంటుంది.

ఈ AI స్టిక్కర్ ఫీచర్ యూజర్లందరికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ టైమ్‌లైన్‌ను ధృవీకరించలేదు. అంతేకాకుండా, ఈ స్టిక్కర్‌లను రూపొందించడానికి ఉపయోగిస్తున్న జనరేటివ్ AI పేరును మెటా పేర్కొనలేదు. జనరేటివ్ AI కూడా నిర్దిష్ట భద్రత, కాపీరైట్ రిస్క్‌లతో వస్తుంది. ఈ AI స్టిక్కర్‌లను సెక్యూర్ చేయడానికి మెటా ఏదైనా తదుపరి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

Read Also : Boult TWS Earbuds : కొత్త బౌల్ట్ రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇదిగో.. కేవలం రూ. 899కే సొంతం చేసుకోండి!