iPhone 16e: కొత్తగా వచ్చిన ఐఫోన్ 16ఈ బెటరా? ఇప్పటికే ఉన్న ఐఫోన్‌ 16 బెటరా? ఏది కొనాలి? ఫుల్‌ డీటెయిల్స్‌..

ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 మధ్య ఉన్న అతిపెద్ద డిఫరెన్స్‌ కెమెరాల్లో కనపడుతుంది.

ఆపిల్‌ సంస్థ తాజాగా ఐఫోన్‌ 16ఈని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఫోన్‌ 14తో పాటు ఐఫోన్‌ 14 ప్లస్‌, ఎస్‌ఈను ఆపిల్ తమ వెబ్‌ నుంచి తీసేసింది. ఆ మూడు ఐఫోన్లనూ ఆపిల్‌ 2022లో విడుదల చేసింది. ఇప్పుడు ఆపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు ఐఫోన్‌ 16 సిరీస్‌, కొత్తగా విడుదలైన ఐఫోన్ 16ఈ అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్‌ ఐఫోన్‌ 15 కాస్త పాత మోడల్ కాబట్టి ఐఫోన్‌ 16 సిరీస్‌లోని ఫోన్లను యూజర్లు కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్‌ 16ఈ కూడా రావడంతో యూజర్ల దృష్టి దీనిపై కూడా పడింది. దీని బేస్‌ మోడల్‌ ధర రూ.59,900గా ఉంది. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16ఈలో దేన్ని కొనాలని తికమకపడుతున్నారా? వాటి ఫీచర్లు, ధరల వివరాలు తెలుసుకుని మీకు నచ్చిన ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 16 కంటే ఐఫోన్ 16ఈ ధర రూ.20,000 తక్కువ. రెండు ఫోన్లు లుక్‌లో ఒకే విధంగా ఉన్నాయి. అలాగే, డిజైన్‌, కోర్‌ ఫంక్షనాలిటీ వంటి అనేక ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. కానీ, వాటిని యూజ్‌ చేసే విధానంలో కొన్ని తేడాలు కనపడుతున్నాయి.

Also Read: బంగారం ధరలు పెరగడానికి టాప్-5 కారణాలు ఇవే.. ఇవి తెలుసుకుని కొనండి..

సైజులో సేమ్‌ టు సేమ్‌
ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 రెండూ 60హెచ్‌జడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల 1080పీ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో వచ్చాయి. అయితే, ఐఫోన్ 16లో డైనమిక్ ఐస్లాండ్‌ ఉంది. ఇందులో మెడ్రన్ ఎడ్జ్‌ ఉంటుంది. కొత్తగా వచ్చిన ఐఫోన్ 16ఈలో మాత్రం ఐఫోన్ 14లో కనపడి నాచ్డ్ డిజైన్‌ ఉంది.

ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 రెండు డిస్ప్లేలకు సిరామిక్ షీల్డ్ ఉంది. స్ట్రాచెస్‌ (గీతలు) పడకుండా, ఫోను కిందపడినా పగలకుండా రక్షించేలా ఈ షీల్డ్‌ ఉంటుంది. అయితే, ఐఫోన్ 16లోని డైనమిక్ ఐస్లాండ్ మరింత ఇంటరాక్టివ్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. నోటిఫికేషన్‌లు బ్యాక్‌గ్రౌండ్‌ యాక్టివిటీస్‌కి అనుగుణంగా ఉంటుంది, అయితే ఐఫోన్ 16ఈలోని నాచ్ స్థిరంగా ఉంటుంది.

బిల్డ్ పరంగా రెండు ఫోన్లలో వాటర్‌, దుమ్ము, ధూళికి నిరోధించడానికి ఐపీ68 రేటింగ్‌తో గ్లాస్-మెటల్ శాండ్‌విచ్ డిజైన్‌ ఉంది. వీటికి యాక్షన్ బటన్‌ను కూడా ఉంటుంది. అయితే, ఐఫోన్ 16ఈలో కెమెరా క్యాప్చర్, మాగ్‌సేఫ్ లేవు.

సేమ్ చిప్
ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 రెండింట్లో దాదాపు ఒకే రకమైన చిప్ ఉంటుంది. కానీ, ఐఫోన్ 16 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లో ఐదు కోర్లు ఉన్నాయి. ఐఫోన్ 16ఈలో నాలుగు ఉన్నాయి. ఈ విషయంలో ఐఫోన్‌ 16ఈ కంటే ఐఫోన్ 16 కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఐఫోన్ 16 సెల్యులార్ నెట్‌వర్కింగ్‌ను.. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 75 మోడెమ్ నుంచి తీసుకున్నారు. అయితే, ఐఫోన్ 16ఈ
ఎన్‌-హౌస్‌ సీ 15జీ మోడెమ్‌ను ఉన్న మొదటి ఆపిల్ డివైజ్.

ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 బేస్ వేరియంట్లు 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వచ్చాయి. రెండింట్లోనూ 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

కెమెరాల్లో..
ఐఫోన్ 16ఈ, ఐఫోన్ 16 మధ్య ఉన్న అతిపెద్ద డిఫరెన్స్‌ కెమెరాల్లో కనపడుతుంది. రెండు ఫోన్‌లలో 48 ఎంపీ మెయిన్ కెమెరా ఉన్నప్పటికీ, ఐఫోన్ 16ఈలోని 1/2.55-అంగుళాల సెన్సార్‌తో పోలిస్తే ఐఫోన్ 16 కొంచెం పెద్దగా 1/1.56-అంగుళాల సెన్సార్‌తో వచ్చింది.

కాగా, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఐఫోన్ 16ఈ 26 గంటల వీడియో ప్లేబ్యాక్‌ సామర్థ్యంతో రాగా, ఐఫోన్ 16 మాత్రం 27 గంటల ప్లేబ్యాక్‌ సామర్థ్యంతో వచ్చింది.

మీ వద్ద రూ.60,000 కంటే తక్కువ బడ్జెట్ ఉంటే ఐఫోన్ 16ఈ కొనుక్కోవచ్చు. మీ బడ్జెట్‌ను మరో రూ.20,000 వరకు పెంచితే ఐఫోన్ 16 కొనుగోలు చేయవచ్చు.