iPhone 17: అబ్బబ్బ.. అందుకే మార్కెట్లో ఐఫోన్‌కు తిరుగులేదు.. దిమ్మతిరిగిపోయే డిజైన్‌తో ఐఫోన్ 17.. ఫీచర్లు ఇవిగో..
ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల మాటేంటి?

ఆపిల్ ఐఫోన్ 17 విడుదల కావడానికి మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఫీచర్ల లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ 17 రీవాంపెడ్ డిజైన్‌తో వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఐఫోన్ 17 ప్రో కెమెరా మాడ్యూల్‌లో మార్పులతో వస్తోందని, ఐఫోన్ 17 ఎయిర్ డిజైన్ సరికొత్తగా ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చాయి.
ఐఫోన్ 17 సిరీస్‌లోని ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్ల గురించి పలువురు విశ్లేషకులు లీకులు ఇచ్చారు కానీ, వనిల్లా ఐఫోన్ 17 (స్టాండర్డ్ మోడల్) ఫీచర్ల గురించి మాత్రం అతి తక్కువ వివరాలు తెలిపారు. వనిల్లా ఐఫోన్ 17 గురించి లీక్‌లు లేకపోవడంతో ఈ బేస్ మోడల్ గురించి ఆపిల్ సంస్థ ఏ ప్లాన్ చేసిందోనని తెలుసుకోవాలనుకుంటున్నారు.
డిజైన్ ఎలా ఉంటుంది?
ఈ ఏడాది ఆపిల్ డిజైన్ల విషయంలో ఎన్నో మార్పులు తీసుకురావాలని ప్రణాళికలు వేసుకుంటోంది. ఎందుకంటే ఐఫోన్ యూజర్లు ఒకే రకమైన డిజైన్‌ను ఏళ్ల తరబడి వాడడాన్ని ఇష్టపడడం లేదు. దీంతో ఈ ఏడాది ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ కోసం కొత్త కెమెరా మాడ్యూల్‌ను తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ఐఫోన్‌కు ఇది కొత్త రూపాన్ని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో త్రిభుజాకార కెమెరా సెటప్‌తో ఉంటుందని లీకుల ద్వారా తెలిసింది. అలాగే, ఎక్స్‌పాండ్ చేసిన కెమెరా బార్‌తో ఉంటుంది. అదనంగా, ఎల్‌ఈడీ ఫ్లాష్, మైక్రోఫోన్, లిడార్ సెన్సార్ కెమెరా బార్ ఐఫోన్‌లోని కుడివైపు పై భాగాన ఉండే మూలకు ఉంటాయి.
ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్‌తోనే వస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ మాత్రం ఒక చిన్న డైనమిక్ ఐస్‌లాండ్‌తో అప్‌గ్రేడై వస్తుండొచ్చు. అలాగే, ఐఫోన్ 17 ఎయిర్ పిక్సెల్ లాంటి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఒకే బ్యాక్ కెమెరా లెఫ్ట్ సైడ్ మూలలో ఉంటుంది. దీంతో ఈ ఐఫోన్ మరింత కొత్తగా ఉండొచ్చు.
ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల మాటేంటి?
మరి ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల విషయంలో యూజర్లు ఆసక్తి చూపుతున్నారు. డిజైన్ విషయంలో మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచింది. ఎందుకంటే ఇది ఐఫోన్ 16 మాదిరిగానే ఉంటుంది. ఆపిల్ డిజైన్ రీహాష్ చేయవచ్చు. అంటే ముఖ్యమైన మార్పులు ఏమీ లేకుండా పాత డిజైన్‌ను రీయూజ్ చేయవచ్చు.
అంతేగానీ, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లలోలాగా అతిపెద్ద మార్పులు ఏమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు. అయినా, ఐఫోన్ 17 మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో డిస్ప్లే అప్‌గ్రేడ్‌తో వస్తుందనే మరి కొందరు నిపుణులు అంటున్నారు. కొన్నేళ్లుగా ఆపిల్ తన స్టాండర్డ్ ఐఫోన్ విషయంలో 60హెచ్‌జెడ్ డిస్‌ప్లేనే తీసుకొస్తోంది.