iPhone 17 Pro Launch : ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో వస్తోందోచ్.. న్యూ లుక్ అదిరిందిగా.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

iPhone 17 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లాంచ్ కానుంది.. వచ్చే సెప్టెంబర్‌లో న్యూ లుక్‌తో అలరించనుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

iPhone 17 Pro Launch

iPhone 17 Pro Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ అతి త్వరలో రాబోతుంది. నివేదికల ప్రకారం.. వచ్చే (iPhone 17 Pro Launch) సెప్టెంబర్ 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 17 ప్రో లీకైన రెండర్ ఆన్‌లైన్‌లో కనిపించింది. మెయిన్ డిజైన్ మార్పులు, కొత్త కలర్ వేరియంట్‌లు ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే లైనప్ ఐఫోన్ 17ప్రో అతి త్వరలో చూడొచ్చు. ఈ కొత్త ప్రో మోడల్ డిస్‌ప్లే, హార్డ్‌వేర్ రెండింటిలోనూ భారీ అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం ఉంది.

ఈసారి ప్లస్ మోడల్ లేనట్టే.. ఐఫోన్ 17 ఎయిర్? :
ఆపిల్ ఈ ఏడాది ‘Plus’ మోడల్స్ ఆపేయనుంది. ఐఫోన్ 17, 17 ప్రో, 17 ప్రో మాక్స్‌లతో పాటు ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. లీకుల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మోడల్ బ్లాక్, బ్రైట్ బ్లూ, ఆరెంజ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో రానుంది. పర్పుల్, స్టీల్ గ్రే ఆప్షన్ కూడా ఉండొచ్చు.

Read Also : Samsung Galaxy F36 5G : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఈరోజే కొత్త F36 5G ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే..!

బిగ్ మాడ్యూల్‌, కొత్త కెమెరా లేఅవుట్ :
ఐఫోన్ 17 ప్రోలో అప్‌గ్రేడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. డిజైన్ మార్పు కూడా ఉండనుంది. కెమెరా ప్లేస్‌మెంట్ గత మోడళ్ల మాదిరిగానే ఉన్నప్పటికీ.. మాడ్యూల్ ఇప్పుడు LED ఫ్లాష్, LiDAR సెన్సార్, మైక్రోఫోన్‌తో భారీ రెక్టాంగులర్ ఐలాండ్ కలిగి ఉంది. ఐఫోన్ 11 ప్రో తర్వాత ప్రో లైనప్‌లో ఫస్ట్ మెయిన్ డిజైన్ మార్పు ఉండే అవకాశం ఉంది.

కొత్త కలర్ ఆప్షన్లు, వేరియంట్లు :
ఐఫోన్ 17 ప్రో మొత్తం 6 కలర్ ఆప్షన్లలో రావచ్చు. కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ఫోన్ బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గోల్డ్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ లేటెస్ట్ ఎండ్ వైడ్ రేంజ్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది.

స్పెషిఫికేషన్లు, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 12GB వరకు ర్యామ్, A19 ప్రో చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. OLED డిస్‌‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉండొచ్చు. iOS26తో ఫ్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఈ అప్‌గ్రేడ్స్‌తో ఆపిల్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్, బ్యాటరీ లైఫ్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లీకైన రెండర్‌లు ఇప్పటికే ఆపిల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 12 మధ్య అధికారిక లాంచ్ అయ్యే అవకాశం ఉంది.