Samsung Galaxy F36 5G : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఈరోజే కొత్త F36 5G ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే..!
Samsung Galaxy F36 5G : శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ వస్తోందోచ్.. ధర కూడా చాలా తక్కువ ఉండొచ్చు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే?

Samsung Galaxy F36 5G
Samsung Galaxy F36 5G : శాంసంగ్ లవర్స్ కోసం మరో కొత్త 5G ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో ఈరోజు (జూలై 19న) భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F36 5G (Samsung Galaxy F36 5G) లాంచ్ కానుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ 2023లో వచ్చిన గెలాక్సీ F34 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్.
లాంచ్‌కు ముందే సౌత్ కొరియా టెక్ దిగ్గజం ఈ 5G ఫోన్ వివరాలను వెల్లడించింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP మెయిన్ రియర్ కెమెరాతో వస్తుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ F36 5G సిరీస్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి అంచనా వివరాలు ఇలా ఉన్నాయి..
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ F36 5G ధర (అంచనా) :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ ధర రూ. 20వేల లోపు ధరలో ఉంటుందని అంచనా. గత మోడల్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ రూ. 18,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ధర కూడా దాదాపు అంతే ఉండవచ్చు. రెడ్, పర్పల్ కలర్ సహా 3 కలర్ ఆప్షన్లలో రానుంది.
జూలై 19న (ఈరోజు) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ F36 5G త్వరలో సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ ఇండియా (Samsung India) ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ 450ppi పిక్సెల్ సాంద్రతతో 1,080×2,340 పిక్సెల్స్ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండనుంది. హుడ్ కింద, ఎక్సినోస్ 1380 SoC ద్వారా పవర్ పొందుతుంది. గెలాక్సీ M36 5G, గెలాక్సీ A55 5G వంటి ఇతర శాంసంగ్ ఫోన్‌లకు కూడా పవర్ అందిస్తుంది. ఈ శాంసంగ్ 5G ఫోన్ కనీసం 6GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7తో వస్తుందని భావిస్తున్నారు.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ F36 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. OIS సపోర్టుతో 50MP మెయిన్ కెమెరాతో రానుంది. ఈ ఫోన్‌తో ‘క్రిస్టల్-క్లియర్’ లో లైటింగ్ ఫొటోలు, వీడియోలను రికార్డు చేయొచ్చు. ఇందులో నైటోగ్రఫీ సపోర్టు కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్ డిజైన్ వివరాలను వెల్లడించింది. లెదర్ ఫినిషింగ్‌తో బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 7.7mm మందం కలిగి ఉంటుంది. ఫొటో, వీడియో-ఎడిటింగ్ టాస్క్ కోసం ఎడిట్ సజెషన్స్, ఇమేజ్ క్లిప్పర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో రానుంది.