Apple Users : మా ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్ తక్షణమే డిలీట్ చేసేయండి..!

ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్‌తో తమ ప్రైవసీ డేటాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపిల్ యూజర్లు. తమ ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు.

Iphone Owners To Delete Google Maps Immediately After New Update

Google Maps iPhone : ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్‌తో తమ ప్రైవసీ డేటాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపిల్ యూజర్లు. తమ ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్ వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటివరకూ గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా ఎంతవరకు పర్సనల్ డేటా కలెక్ట్ చేశారో చెప్పాలంటున్నారు. ఆపిల్ స్టోర్‌లో గూగుల్ మ్యాప్స్ ప్రైవసీ లేబుల్ ద్వారా ఐఫోన్ యూజర్ల ఆర్థిక డేటా, కాంటాక్టులు, బ్రౌజింగ్ హిస్టరీతో పాటు సెర్చ్ హిస్టరీకి సంబంధించి డేటాను గూగుల్ మ్యాప్స్ యాప్ సేకరించడంపై యూజర్లు ఆందోళన చెందుతున్నారు.

ఐఫోన్లలో ఆపిల్ మ్యాప్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు గూగుల్ మ్యాప్స్ లేబుల్స్ కూడా ఉంటాయి. అయితే గూగుల్ మ్యాప్స్ యూజర్ల ప్రైవసీ డేటాను ఎలా కలెక్ట్ చేసింది? డేటా మీ పర్సనల్ ఐడెంటిటీకి లింక్ అయి ఉంటుందని ఉండటంపై ఐఫోన్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆపిల్ మ్యాప్స్‌లో మాత్రం.. తక్కువ డేటా మాత్రమే సేకరిస్తున్నామని, మీ ఐడెంటిటీతో లింక్ కాలేదని ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ కంటే.. ఆపిల్ మ్యాప్స్ ఎంతో సురక్షితమని భావిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్ల ఆసక్తిని బట్టి వారి డేటాను యాడ్స్ కోసం సేకరిస్తున్నట్టు గూగుల్ పేర్కొంది.

కానీ, ఐఫోన్ యూజర్లు తమ డేటా విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన గూగుల్.. తమ మ్యాప్స్ యూజర్ల డేటాను ప్రొటక్ట్ చేసేందుకు డిజైన్ చేసినట్టు వెల్లడించింది. యూజర్ల డేటా సేఫ్ గా ఉండేందుకు వీలుగా సెట్టింగ్స్ కంట్రోల్ అందిస్తున్నట్టు తెలిపింది. గూగుల్ మ్యాప్స్ incognito mode ఆప్షన్ లోనూ డేటా కలెక్టింగ్ నిలిపివేసే అవకాశం ఉంది. ఇదివరకే ఆపిల్ తమ ఐఫోన్లలో కొత్త iOS 15 Updateతో కొత్త మ్యాప్స్ తీసుకొస్తున్నట్టు తెలిపింది. నేవిగేషన్ కోసం iOS 15 అప్ డేట్ లో సరికొత్త మ్యాప్స్ ద్వారా నావిగేట్ అనుభవాన్ని పొందవచ్చునని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు