iPhone Users
iPhone Charge Feature : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ ఆండ్రాయిడ్ మాదిరి కొత్త ఐఓఎస్ అప్‌డేట్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇకపై, ఐఫోన్ వినియోగదారులు తమ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపించే ఈ కొత్త ఫీచర్ చివరకు ఐఓఎస్‌లో కూడా వస్తోంది. ఇలాంటి సాధారణ ఫీచర్ ఐఫోన్‌లో చాలా ఏళ్లుగా అందుబాటులో లేదు. కానీ, ఐఓఎస్ 18 చివరకు ఐఫోన్ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుంది? ఇంకా ఎంత సమయం ఛార్జింగ్ కావాల్సి ఉంది అనే వివరాలను అందించగలదు.
ఐఫోన్ ఛార్జింగ్ టైమ్ స్టేటస్, ఐఓఎస్ 18.2కి వస్తుందా? :
కొత్త నివేదికల ప్రకారం.. రాబోయే ఐఓఎస్18 వెర్షన్ ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను పొందవచ్చు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఛార్జ్ చేసినప్పుడు, పూర్తి ఛార్జ్ చేసేందుకు ఎంత సమయం మిగిలి ఉందో సూచిస్తుంది. ప్రస్తుత బ్యాటరీ లెవల్ ఆధారంగా 25 నిమిషాలు లేదా 75 నిమిషాలు ఉండవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్‌కు బ్యాటరీ ఇంటెలిజెన్స్ అనే కోడ్‌నేమ్ కలిగి ఉంది.
రాబోయే నెలల్లో ఫుల్ అప్లికేషన్ పబ్లిక్ వెర్షన్‌తో అందుబాటులోకి రావచ్చు. ఈ ఫీచర్‌తో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఐఫోన్ వినియోగదారులు ఛార్జింగ్ కోసం తమ ఫోన్ ప్లగ్ ఇన్ చేసి ఉంచేందుకు ఎంత సమయం ఉందో తెలుసుకోవచ్చు. రెండోవది.. ఛార్జర్ అందించే ఛార్జింగ్ స్పీడ్ అందిస్తుంది. ఆపిల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు చివరికి ఐప్యాడ్స్ కూడా ఇలాంటి టూల్స్ అందించనుంది.
ఆపిల్ ఐఫోన్లలో ఛార్జింగ్ యానిమేషన్ ఆప్షన్ అందిస్తుంది. వినియోగదారులు అవసరానికి సరిపోయేలా విజువల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్లు వచ్చే నెలలో ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16, ఐఫోన్ 16ప్రో మోడళ్లకు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను యాక్సస్ చేయొచ్చు. ఐఫోన్ యూజర్లంతా పబ్లిక్ ఐఓఎస్ 18.2 అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ బ్యాటరీ పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు.. ఆపిల్ ఏమన్నదంటే?