iQOO 13 Launch
iQOO 13 Launch : ఐక్యూ అభిమానులకు గుడ్ న్యూస్.. అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఐక్యూ 13 ఫోన్ వచ్చేసింది. ఈసారి గ్రీన్ కలర్ వేరియంట్ రిలీజ్ అయింది. గత ఏడాదిలో (iQOO 13 Launch) లెజెండ్, నార్డో గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా, ఇప్పుడు, మూడో కలర్ వేరియంట్ ఆవిష్కరించింది.
ఈ కొత్త కలర్ ఆప్షన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoCతో పాటు ప్రత్యేకమైన గేమింగ్ చిప్‌ను కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఐక్యూ 13 ఫోన్ 144Hz 2K LTPO అమోల్డ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ కొత్త కలర్ వేరియంట్ ఈ నెలాఖరులో అమ్మకానికి రానుంది.
భారత్‌లో ఐక్యూ 13 ధర, కలర్ ఆప్షన్లు :
కొత్త ఐక్యూ 13 ఫోన్ ఏస్ గ్రీన్ కలర్ ఆప్షన్ ధర వరుసగా రూ. 54,999, 16GB + 512GB ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లకు రూ. 59,999కు పొందవచ్చు. ఇప్పుడు లెజెండ్, నార్డో గ్రే కలర్ ఆప్షన్‌లతో సహా 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కొత్త గ్రీన్ వేరియంట్ జూలై 12 నుంచి అమెజాన్, ఐక్యూ ఇండియా ఇ-స్టోర్ ద్వారా సేల్ ప్రారంభం కానుందని కంపెనీ వెల్లడించింది.
ఐక్యూ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ 13 ఫోన్ 6.82-అంగుళాల 2K (1,440×3,186 పిక్సెల్స్) LTPO అమోల్డ్ స్క్రీన్‌ను 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో కలిగి ఉంది. 3nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC, డెడికేటెడ్ ఇన్-హౌస్ గేమింగ్ Q2 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.
హీట్ డిస్సిపేషన్ కోసం 7,000mm వేపర్ చాంబర్‌తో అమర్చి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 16GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఐక్యూ 13లో 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ షూటర్, బ్యాక్ సైడ్ 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP సెన్సార్ ఉంది.
ఐక్యూ 13లో 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP68, IP69 రేటింగ్‌లు కలిగి ఉంది. ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB 3.2 జెన్ 1 టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. మందం 8.13mm, బరువు 213 గ్రాములు ఉంటుంది.