EPFO Rule : ఈపీఎఫ్ఓ రూల్.. 10ఏళ్లు ఉద్యోగం చేశాక పెన్షన్ వస్తుందా?.. సర్వీసు ఎంత ఉండాలి? ఎవరు అర్హులు? బెనిఫిట్స్ ఏంటి?

EPFO Rule : ఈపీఎఫ్ఓ సభ్యులకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఎన్ని ఏళ్లు సర్వీసు ఉండాలి? పెన్షన్ పొందడానికి ఎవరు అర్హులు.. పూర్తి వివరాలివే..

EPFO Rule : ఈపీఎఫ్ఓ రూల్.. 10ఏళ్లు ఉద్యోగం చేశాక పెన్షన్ వస్తుందా?.. సర్వీసు ఎంత ఉండాలి? ఎవరు అర్హులు? బెనిఫిట్స్ ఏంటి?

EPFO Rule

Updated On : July 5, 2025 / 1:40 PM IST

EPFO Rule : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను అందిస్తోంది. ఈ పథకం కింద ఈపీఎఫ్ఓ సభ్యులు సర్వీస్ వ్యవధి, జీతం ఆధారంగా కొంత కాలం తర్వాత నెలవారీ పెన్షన్ పొందవచ్చు.

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను ఈపీఎఫ్ఓ ​​16 నవంబర్ 1995న ప్రారంభించింది. 1971లో ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ వచ్చింది. అయితే, కొన్ని షరతులు ఉన్నాయి. పెన్షన్ పూర్తి ప్రక్రియకు సంబంధించి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

10 ఏళ్ల సర్వీసు తర్వాత పెన్షన్ :
EPS అనేది పెన్షన్ స్కీమ్.. ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహిస్తుంది. ప్రస్తుత, కొత్త EPF సభ్యులు ఈ పథకం కింద చేరవచ్చు. ఈపీఎఫ్ఓ​ నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగి అయినా 10 ఏళ్లు పనిచేసిన తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు. అయితే, ఈ పెన్షన్ 58 ఏళ్లు నిండిన తర్వాత పొందవచ్చు.

Read Also : ITR Refund : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ITR ఫైలింగ్ చేశాక రీఫండ్ ఆలస్యమైందా? ఎన్ని రోజుల్లో రీఫండ్ వస్తుంది? స్టేటస్ చెకింగ్ ఎలా?

పీఎఫ్ ఖాతాలో డబ్బు క్రెడిట్ ఎలా? :
మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటే.. మీ జీతంలో 12శాతం మీ PF అకౌంటుకు వెళుతుంది. మీ కంపెనీ కూడా అదే మొత్తాన్ని అందిస్తుంది. కానీ, అందులో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌లో క్రెడిట్ అవుతుంది. మిగిలిన 3.67శాతం PFలో క్రెడిట్ అవుతుంది.

ఉద్యోగం మానేస్తే పెన్షన్ వస్తుందా? :
మీరు 10 ఏళ్లు ఉద్యోగంలో పనిచేసి ఉంటే.. పెన్షన్‌కు అర్హులు అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి మధ్యలో తన ఉద్యోగాన్ని కోల్పోయి కొన్నాళ్లు ఖాళీగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం పొందితే పెన్షన్ వస్తుందా? అనే సందేహం వస్తుంది. EPFO రూల్ ప్రకారం.. 10 ఏళ్ల వ్యవధి పూర్తయిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఉద్యోగి UAN నంబర్‌ను మార్చకపోతే.. పెన్షన్‌కు అర్హులు అవుతాడు. అదే UAN నంబర్‌తో 10 ఏళ్లు ఉద్యోగం చేసి ఉండాలి. పీఎం ఖాతాలో జమ అయ్యే నగదును అదే UAN ద్వారా చెక్ చేయొచ్చు.

పెన్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలా? :
మీరు 10ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేస్తే మరో ఆప్షన్ ఉంది. భవిష్యత్తులో మళ్ళీ అదే ఉద్యోగం చేయాలనుకుంటే పెన్షన్ స్కీమ్ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి పరిస్థితిలో మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడల్లా ఈ పెన్షన్ సర్టిఫికేట్ ద్వారా గత పెన్షన్ అకౌంట్ కొత్త ఉద్యోగానికి లింక్ చేయవచ్చు.