ITR Refund : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ITR ఫైలింగ్ చేశాక రీఫండ్ ఆలస్యమైందా? ఎన్ని రోజుల్లో రీఫండ్ వస్తుంది? స్టేటస్ చెకింగ్ ఎలా?
ITR Refund : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత చాలామందికి రీఫండ్ ఆలస్యం అవుతుంది. అయితే, అకౌంటులో రీఫండ్ క్రెడిట్ అయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందంటే?

ITR Refund
ITR Refund : మీ ఐటీఆర్ ఫైలింగ్ చేశారా? ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఐటీఆర్ గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. డ్యూ డేట్ వరకు ఐటీఆర్‌ను దాఖలు చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే వడ్డీ కూడా చెల్లించాలి. డిసెంబర్ 31, 2025 వరకు దానిని దాఖలు చేయవచ్చు.
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. జూలై 1 వరకు 75,18,450 కన్నా ఎక్కువ ఐటీఆర్ రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. 71,11,836 రిటర్న్‌లు కూడా వెరిఫై అయ్యాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు తర్వాత పన్ను చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రీఫండ్ డబ్బు ఎన్ని రోజుల్లో ఖాతాలోకి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎన్ని రోజుల్లో రీఫండ్ వస్తుంది? :
ఆదాయపు పన్ను శాఖ ఆటోమేషన్, అప్‌గ్రేడ్స్ తర్వాత ఆదాయపు పన్ను రీఫండ్ ఇప్పుడు 10 రోజుల్లో జారీ అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, రీఫండ్ పొందే కాలపరిమితి కూడా కొన్నిసార్లు మారవచ్చు. ఒక్కోసారి ఐటీఆర్ రీఫండ్ కొన్ని రోజుల్లోనే ప్రాసెస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వారాల సమయం పడుతుంది.
రీఫండ్ ఆలస్యానికి కారణాలివే :
- ITR e-వెరిఫికేషన్ లేకుండా రీఫండ్ పొందలేరు.
- పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే రీఫండ్ ఆలస్యం అవ్వొచ్చు.
- TDS వివరాలు ఫారం 26AS (టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్)తో మ్యాచ్ కాకపోతే రిటర్న్ కూడా నిలిచిపోవచ్చు.
- బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఏదైనా లోపం, రాంగ్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్‌లో ఏదైనా తప్పు ఉంటే కూడా రిటర్న్ నిలిచిపోతుంది.
- డిపార్ట్‌మెంట్ నోటీసులు లేదా ఇమెయిల్‌కు రెస్పాండ్ కాకపోయినా రిటర్న్ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది.
- కేవలం ఐటీఆర్ దాఖలు చేస్తే సరిపోదు.. ఇ-వెరిఫికేషన్ కూడా చాలా అవసరం.
- ఆధార్, నెట్ బ్యాంకింగ్, ఇతర OTPతో సులభంగా పూర్తి చేయవచ్చు.
ITR రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి :
మీరు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ లేదా (TIN NSDL) పోర్టల్ ఉపయోగించి మీ రీఫండ్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
- ఈ-ఫైలింగ్ పోర్టల్ (https://eportal.incometax.gov.in/iec/foservices/#/login)కి వెళ్లండి.
- మీ యూజర్ ఐడీ (పాన్ లేదా ఆధార్ నంబర్) ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- డాష్‌బోర్డ్‌లో, ‘e-File’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- ‘Income Tax Returns’ని ఎంచుకోవాలి.
- ‘View Filed Returns’ని ఎంచుకోండి.
- ఫైలింగ్ చేసిన రిటర్న్‌ల జాబితా కనిపిస్తుంది.
- సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ‘View Details’పై క్లిక్ చేయండి.
- మీరు ఫుల్ రీఫండ్ వివరాలను చూడవచ్చు.
TIN-NSDL వెబ్‌సైట్‌లో రీఫండ్ చెక్ చేయండి :
- అధికారిక NSDL వెబ్‌సైట్ (https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html)ను విజిట్ చేయండి.
- మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
- స్క్రీన్‌పై కనిపించే కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- మీ ఆదాయపు పన్ను రీఫండ్ లేటెస్ట్ స్టేటస్ ‘Continue’ పై క్లిక్ చేయండి.