iQOO Neo 10 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు.. Oppo Reno 14 కొంటారా? iQOO Neo 10 కొంటారా? మీకు ఏది బెస్ట్‌?

ఒప్పో రెనో 14లో మంచి కెమెరా సెటప్‌, వర్చువల్‌ RAM, ప్రీమియం డిజైన్‌ ఉన్నాయి.

మిడ్‌ రేంజ్‌ ధరలో ఓ మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? Oppo Reno 14, iQOO Neo 10 ఫోన్లు మార్కెట్‌లో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌, చార్జింగ్‌ సామర్థ్యం పరంగా రెండూ మంచి ఫీచర్లతో ఉన్నాయి. ప్రస్తుతం iQOO Neo 10 5Gపై ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

ప్రాసెసర్‌
ఒప్పో రెనో 14లో MediaTek Dimensity 8350 చిప్ 3.35GHz octa core స్పీడ్‌తో పనిచేస్తుంది. ఐకై నియో10లో Qualcomm Snapdragon 8s Gen4 3.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. రెండూ 5G సపోర్ట్‌తో వేగవంతమైనవే, కానీ Snapdragon పనితీరు, పవర్‌ సేవింగ్‌లో కొద్దిగా మెరుగ్గా నిలుస్తుంది.

ఒప్పోలో 8GB RAM, 8GB వర్చువల్ RAM ఉంది. iQOOలో కూడా 8GB RAM వుంది, కానీ Qualcomm ఆర్కిటెక్చర్ అభిమానులకు ఇది నచ్చే అవకాశం ఉంది.

Also Read: మీరు ట్రాఫిక్ చలాన్లు ఎప్పటికప్పుడు కట్టడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ హుష్ కాకి

డిస్‌ప్లే, బ్యాటరీ
Oppoలో 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్‌ ఉంది. 100% DCI-P3 కలర్‌ సపోర్ట్‌ కూడా ఉంది. iQOO Neo 10లో 6.78 అంగుళాల పెద్ద AMOLED స్క్రీన్‌, 144Hz స్మూత్‌ రిఫ్రెష్‌ రేట్, 3000Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ఉంది.

డిస్‌ప్లే, గేమింగ్‌ రెస్పాన్స్‌ చూస్తే iQOO ముందంజలో ఉంది. బ్యాటరీ విషయంలో Oppoలో 6000mAh సెల్, 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్‌ ఉన్నాయి. iQOOలో 7000mAh భారీ బ్యాటరీ, 120W చార్జింగ్‌. రివర్స్‌ చార్జింగ్‌ రెండింట్లో ఉంది, కానీ స్క్రీన్ ఆన్ టైమ్‌ iQOOలో ఎక్కువగా ఉంటుంది.

కెమెరా
Oppoలో 50MP + 50MP + 8MP ట్రిపుల్ రియర్‌ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా. iQOOలో 50MP + 8MP డ్యుయల్‌ రియర్‌, 32MP సెల్ఫీ కెమెరా. కెమెరా సంఖ్య, హై-రిజల్యూషన్‌ ఫ్రంట్‌ కెమెరా కావాలనుకునేవారికి Oppo నచ్చుతుంది. రెండు ఫోన్లు 4K@60fps వీడియో రికార్డింగ్‌ చేస్తాయి. కానీ Oppoలో అదనపు సెన్సార్‌ ఉంటుంది.

ధర
ఒప్పో రెనో 14 ధర రూ.37,999 (Amazon, Croma), iQOO Neo 10 ధర రూ.31,999 (Amazon), రూ.34,190 (Flipkart). ధరలో రూ.6,000 వరకు తేడా ఉండటం వల్ల బడ్జెట్‌ చూసే వారికి iQOO నచ్చుతుంది. కొన్ని క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొంటే రూ.1,500 వరకు డిస్కౌంట్‌ వస్తుంది. ఆఫర్ల వల్ల రెండు ఫోన్ల ధరలూ మరింత తగ్గుతాయి.

ఒప్పో రెనో 14లో మంచి కెమెరా సెటప్‌, వర్చువల్‌ RAM, ప్రీమియం డిజైన్‌ ఉన్నాయి. ఐకూ నియో 10లో ఫాస్ట్‌ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, వేగవంతమైన చార్జింగ్‌, తక్కువ ధర ఆకట్టుకుంటాయి. కెమెరా, కలర్‌ క్వాలిటీ చూస్తే Oppo బాగుంటుంది. కానీ బ్యాటరీ లైఫ్‌, చార్జింగ్‌, డిస్‌ప్లే మరింత బాగుండాలనుకునేవారికి రూ.32,000 కంటే తక్కువలో లభ్యమవుతున్న iQOO Neo 10 నచ్చుతుంది.