మీరు ట్రాఫిక్ చలాన్లు ఎప్పటికప్పుడు కట్టడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ హుష్ కాకి

చాలా మంది ట్రాఫిక్​రూల్స్​ ఉల్లంఘిస్తూ చలాన్లు కూడా కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

మీరు ట్రాఫిక్ చలాన్లు ఎప్పటికప్పుడు కట్టడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌ హుష్ కాకి

Updated On : July 8, 2025 / 7:28 AM IST

వరుసగా మూడు నెలలపాటు ట్రాఫిక్​ చలాన్లు పెండింగ్‌లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను సస్పెండ్ చేయాలని తెలంగాణ రవాణా శాఖ భావిస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ అంశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని దారిలో పెట్టాలని ట్రాఫిక్​ పోలీసులు భావిస్తున్నారు. ఇందుకుగానూ ఎప్పటికప్పుడు ఫైన్లను వసూలు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో వాహనదారుడి బండిపై మూడు నెలలకు పైగా చలాన్లు పెండింగ్‌‌‌‌లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన చేశారు.

Also Read: శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు రిపోర్టు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. దీన్ని అమలు చేస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిని కట్టడి చేయడంతో పాటు ఫైన్లను ఎప్పటికప్పుడు క్లియర్​ చేయించవచ్చని, రాష్ట్ర ఖజానాకు కూడా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

వాహనదారులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చాలా మంది డ్రంకెన్​ డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. మరికొందరు ఓవర్ స్పీడ్‌లో వెళ్లడం రాంగ్ రూట్‌లో రావడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇటువంటి కేసుల్లో తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ నుంచి 2025, జూన్ 25 వరకు మొత్తం 18,973 డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌లను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. వారిలో దాదాపు 10,000 మందికిపైగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే.

చాలా మంది ట్రాఫిక్​రూల్స్​ ఉల్లంఘిస్తూ చలాన్లు కూడా కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అటువంటి వారు పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు వారి వాహనంపై వేలాది రూపాయల ఫైన్లు కనపడుతున్నాయి. అంత మొత్తం డబ్బు చెల్లించలేక చాలా మంది రోడ్డుమీదే వాహనాలను వదిలేసి వెళ్లిపోతున్నారు.