iQOO Neo 10 Price : ఐక్యూ నియో 10 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవేనా?

iQOO Neo 10 : ఐక్యూ నియో 10 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి.

iQOO Neo 10 Price

iQOO Neo 10 Price : ఐక్యూ యూజర్ల కోసం సరికొత్త ఫోన్ రాబోతుంది. మే 26న భారత మార్కెట్లో ఐక్యూ నియో 10 (iQOO Neo 10) ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పటికే లాంచ్ అయిన ఐక్యూ నియో 10R సిరీస్‌లో చేరనుంది.

Read Also : OnePlus 13 : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 13పై బిగ్ డిస్కౌంట్.. తక్కువ ధరలో ఇలా కొనేసుకోండి!

ఈ హ్యాండ్‌సెట్ అధికారికంగా లాంచ్ అయ్యేందుకు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ టాప్ బ్రాండ్ ఇప్పటికే అమెజాన్ ల్యాండింగ్ పేజీ ద్వారా రివీల్ చేసింది. ఐక్యూ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది.

ఈ హ్యాండ్‌సెట్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్‌గా ఉండనుంది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 144fps గేమింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ ఇంకా కచ్చితమైన ధరను రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.35వేలు ఉంటుందని అంచనా. రాబోయే ఐక్యూ నియో 10 గురించి మరిన్ని వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

ఐక్యూ నియో 10 ధర :
భారత మార్కెట్లో ఐక్యూ నియో 10 ధర రూ.33వేలు నుంచి రూ.35వేల మధ్య ధరతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. ఐక్యూ నియో 10 ధర బ్యాంక్ ఆఫర్ల తర్వాత రూ.34,999 ఉండనుంది.

ఐక్యూ ఫోన్ ధర రూ.35వేల కన్నా తక్కువగా ఉంటుంది. గత ఏడాదిలో ఐక్యూ నియో 9 ప్రో ధర రూ.35,999, ఐక్యూ నియో 10R బేస్ మోడల్ ధర రూ.26,999 వద్ద లాంచ్ అయింది.

ఐక్యూ నియో 10 స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 10 ఫోన్ 1.5K రిజల్యూషన్, 5,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్ 144FPS గేమింగ్ 3,000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

పర్ఫార్మెన్స్ పరంగా.. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, వివో Q1 చిప్ ఎక్స్‌టెండెడ్ గేమింగ్ గంటల కోసం 7K VC లిక్విడ్ కూలింగ్ ద్వారా సపోర్టు చేస్తుంది.

120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లో 0 నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Motorola Phones : కొత్త మోటోరోలా ఫోన్లు భలే ఉన్నాయి.. టాప్ 3 మోటోరోలా ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. OISతో 50MP సోనీ పోర్ట్రెయిట్ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఐక్యూ ఫోన్ LPDDR5x ర్యామ్, UFS 4.1తో 8.09mm మందంతో వస్తుంది.