iQoo Neo 8 Series Launch Date Set for May 23, Key Specifications Revealed
iQoo Neo 8 Series Launch Date : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నుంచి iQOO Neo 8 5G, iQoo Neo 8 Pro సిరీస్ వస్తోంది. మే 23న చైనాలో లాంచ్ ఐక్యూ నియో 8 నియో సిరీస్ లాంచ్ కానుంది. Weibo పోస్ట్ ద్వారా కంపెనీ ఫోన్ డిజైన్‌తో పాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది. iQoo Neo 8 5G సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్‌లతో పాటు బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించింది. iQoo Neo 8 5G సిరీస్ కూడా MediaTek డైమెన్సిటీ 9200+ SoC, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ద్వారా రానుంది.
త్వరలో రాబోయే iQoo Neo 8 5G సిరీస్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యంతో పాటు కెమెరా స్పెసిఫికేషన్‌లను లాంచ్‌కు ముందే వెల్లడించింది. మే 23న స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు (సాయంత్రం 4.30 గంటలకు IST) చైనాలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP OIS-సపోర్టు ఉన్న మెయిన్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. టీజర్ పోస్టర్ ప్రకారం.. రెండు కెమెరా సెన్సార్లు వృత్తాకార కటౌట్‌లలో ఉంటాయి. మూడో సెన్సార్ LED ఫ్లాష్ పక్కన చిన్న కటౌట్‌తో రానుంది.
iQoo Neo 8 Series Launch Date Set for May 23, Key Specifications Revealed
రాబోయే iQoo Neo 8 5G సిరీస్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించే 5,000 mAh బ్యాటరీతో రానుందని చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అదనంగా, కంపెనీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, ప్రాసెసర్ స్పెసిఫికేషన్‌లను కూడా షేర్ చేసింది. iQoo ఫోన్ లాంచ్ పోస్టర్ ప్రకారం.. iQoo Neo 8 5G ప్రోలో MediaTek 9200+ SoCతో పాటు 16GB వరకు RAM ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. హై-ఎండ్ iQoo Neo 8 Proలో Vivo V1+ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఇతర ఫోన్ల స్పెసిఫికేషన్ 5K మాదిరిగానే VC త్రీ-డైమెన్షనల్ హీట్ డిస్సిపేషన్ ఉండనున్నాయి. భారత మార్కెట్లో Qoo Neo 8 5G సిరీస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.