iQOO జెడ్10 వచ్చేస్తోంది.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఫీచర్లు కెవ్వుకేక 

iQOO Z10 కలర్ వేరియంట్ల గుర్తించి ఆ సంస్థ అధికారికంగా పలు వివరాలు తెలిపింది.

iQOO జెడ్10 వచ్చేస్తోంది.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఫీచర్లు కెవ్వుకేక 

iQOO Z10 colour variants

Updated On : March 27, 2025 / 2:39 PM IST

iQOO నుంచి భారత్‌లో న్యూ జనరేషన్‌ జెడ్‌ సిరీస్ స్మార్ట్‌ఫోన్ iQOO జెడ్10 విడుదల కానుంది. ఆ సంస్థ ఇప్పటికే ఏప్రిల్ 11న లాంచ్‌ తేదీని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 7300mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని చెప్పింది. దీంతో దీని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

లాంచ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవుతున్నాయి. కొత్త iQOO Z సిరీస్ మోడల్ గురించి ఆ సంస్థ తాజాగా ఓ పోస్ట్‌లో iQOO Z10 కలర్‌ వేరియంట్‌ల గురించి తెలిపింది. మిడ్-రేంజ్ ఫోన్‌ను కొనాలని మీరు అనుకుంటుంటే iQOO Z10ను కొనుక్కోవచ్చు.

Also Read: దేవాదుల పంప్ హౌస్‎పై 10టీవీ కథనాలకు స్పందన

iQOO Z10 కలర్ వేరియంట్లు
iQOO Z10 కలర్ వేరియంట్ల గుర్తించి ఆ సంస్థ అధికారికంగా పలు వివరాలు తెలిపింది. iQOO Z10 స్టెల్లార్ బ్లాక్, గ్లేసియర్ సిల్వర్ షేడ్స్‌లో వస్తుందని చెప్పింది. కలర్‌ వేరియంట్లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లో వాడిన ప్రాసెసర్ గురించి కూడా ఆ కంపెనీ తెలిపింది. iQOO Z10ను స్నాప్‌డ్రాగన్‌తో లాంచ్‌ చేస్తున్నట్లు క్లూ ఇచ్చింది. దీంతో, ఇందులో స్నాప్‌ప్రాగన్ చిప్ వాడతారన్న అంచనాలు నెలకొన్నాయి.

కలర్ వేరియంట్‌లను పరిశీలిస్తే iQOO Z10 మార్చి 31న లాంచ్ కానున్న చైనా vivo Y300 Pro+ లోని వేరియంట్లలానే ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC, 7,300 mAh బ్యాటరీతో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో iQOO Z10ను vivo Y300 Pro+ రీబ్రాండెడ్ వెర్షన్ అని విశ్లేషకులు అంటున్నారు.

ఇటీవలి స్పాటింగ్‌లో iQOO Z10 సైతం AnTuTu బెంచ్‌మార్క్‌లో కనిపించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ 765,324 AnTuTu స్కోర్‌ను సాధించింది. ఇది UFS 2.2 స్టోరేజ్‌ను అందిస్తున్నట్లు తెలిసింది. కచ్చితమైన స్టోరేజ్ స్పేస్ గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు.