iQOO Z10 Lite 5G
iQOO Z10 Lite 5G : ఐక్యూ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో కొత్త ఐక్యూ 5G ఫోన్ రాబోతుంది. గత ఏప్రిల్‌లో భారత మార్కెట్లో ఐక్యూ Z10, ఐక్యూ Z10x లాంచ్ తర్వాత ఐక్యూ Z10 లైట్ 5G (iQOO Z10 Lite 5G) సిరీస్‌ను విస్తరించనుంది. అధికారిక టీజర్ ప్రకారం.. ఐక్యూ Z10 లైట్ 5G అతిపెద్ద బ్యాటరీతో రానుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్ Z10x కలిగి ఉండొచ్చు.
జూన్ 18నే లాంచ్ :
ఐక్యూ ఇండియా టీజర్ ప్రకారం.. జూన్ 18న ఐక్యూ Z10 లైట్ 5G అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఉంటుంది. అలాగే, అదనపు కలర్ ఆప్షన్లలో కూడా రావచ్చు. కొత్త ఐక్యూ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌తో రానుంది. అమెజాన్‌లో కూడా విక్రయానికి రానుంది. ఐక్యూ Z10 లైట్ 5G వివరాలపై అధికారికంగా ప్రకటించలేదు.
అంచనాల ప్రకారం.. ఐక్యూ Z10 లైట్ 5G HD+ రిజల్యూషన్‌తో 6.5 నుంచి 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఐక్యూ Z9 లైట్ HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. ఐక్యూ Z9 లైట్ మాదిరిగా 5,000mAh బ్యాటరీ కన్నా ఎక్కువగా ఉండనుంది. ఛార్జింగ్ స్పీడ్ 15W వద్ద ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఫన్‌టచ్OS 15 కావచ్చు. ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.
50MP డ్యూయల్-రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాతో ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ఐక్యూ Z9 లైట్ మాదిరిగానే ఉండనుంది. ధర విషయానికొస్తే.. ఐక్యూ Z10 లైట్ 5G ధర రూ. 9,999 నుంచి ఉండవచ్చు. ఈ ఫోన్ కనీసం 128GB బేసిక్ స్టోరేజ్, 4GB లేదా 6GB ర్యామ్ ఆప్షన్లతో గత మోడల్ మాదిరిగానే ఉండొచ్చు.