Vivo Y-Series : కర్వడ్ డిస్‌ప్లేతో కొత్త వివో Y-సిరీస్ వచ్చేస్తోంది.. కలర్ ఆప్షన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo Y-Series : వివో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. కర్వడ్ డిస్‌ప్లేతో కూడిన వివో వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి.

Vivo Y-Series : కర్వడ్ డిస్‌ప్లేతో కొత్త వివో Y-సిరీస్ వచ్చేస్తోంది.. కలర్ ఆప్షన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

Vivo Y Series

Updated On : June 8, 2025 / 6:00 PM IST

Vivo Y-Series : కొత్త వివో స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? వివో కంపెనీ నుంచి మరో సరికొత్త Y సిరీస్ వచ్చేస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్లో Y19 5G లాంచ్ అయింది. నివేదికల ప్రకారం.. చైనీస్ (Vivo Y-Series) టెక్ కంపెనీ ఇప్పుడు దేశంలో కొత్త Y సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఆ ఫోన్ పేరు ఏంటి అనేది వెల్లడించలేదు. కానీ, కర్వ్ అమోల్డ్ స్క్రీన్ ఉంటుందని భావిస్తున్నారు. 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో రూ. 15వేల కన్నా తక్కువ ధరలో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రానుంది.

Read Also : MacBook Air M1 : మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

రాబోయే వివో Y సిరీస్ ఫోన్ నెబ్యులా పర్పుల్, వైల్డ్ వైట్, జాయ్‌ఫుల్ గోల్డ్ కలర్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. నివేదికల ప్రకారం.. ఫ్రీస్టైల్ వైట్ కలర్ ఆప్షన్ బ్యాక్ ప్యానెల్‌ కలిగి ఉంది. మందం 7.49మిమీ ఉంటుంది. వివో పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు వివో Y78 5G, వివో Y200 ప్రో, వివో Y300 ప్లస్ వంటి కర్వ్ స్క్రీన్‌లతో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రాబోయే వివో ఫోన్ వివో Y19 సిరీస్ మాదిరి ఫీచర్లు ఉండొచ్చు.

వివో Y19 5G ధర, ఫీచర్లు   :
వివో Y19 5G ఫోన్ (Vivo Y-Series) 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 10,499కు పొందవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. 6.74-అంగుళాల HD+ (720 x 1,600 పిక్సెల్స్) వివో Y19 5G డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

13MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ సెన్సార్, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే, IP54-రేటెడ్ డిజైన్, 15W వద్ద 5,500mAh బ్యాటరీ కలిగి ఉంది.

ఈ వివో ఫోన్ వాటర్‌డ్రాప్-నాచ్ డిజైన్‌తో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. సున్నితమైన నావిగేషన్, మీడియా వినియోగానికి సరైనది. ఈ డిస్‌ప్లే బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్ కూడా కలిగి ఉంది.

Read Also : Gautam Adani : అదానీ జీతం మరీ తక్కువ.. ఆయన దగ్గర పనిచేసే వాళ్ల కంటే కూడా తక్కువ.. ఏడాదికి జస్ట్..!

అదనంగా, వివో Y19 5G ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. రెయిన్‌బో క్రిస్టల్ టెక్స్చర్‌తో మెటాలిక్ మ్యాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP64 రేట్ కలిగి ఉంది. అంతేకాకుండా, ఫోన్ స్విస్ SGS ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను ఆమోదించింది.