Gautam Adani : అదానీ జీతం మరీ తక్కువ.. ఆయన దగ్గర పనిచేసే వాళ్ల కంటే కూడా తక్కువ.. ఏడాదికి జస్ట్..!
Gautam Adani : అదానీ మొత్తం వేతనం మునుపటి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన రూ.9.26 కోట్ల కన్నా 12 శాతం ఎక్కువ.

Gautam Adani
Gautam Adani : దేశంలోనే రెండవ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 10.41 కోట్ల జీతం అందుకున్నారు. వార్షిక ప్రాతిపదికన 12 శాతం (Gautam Adani) ఎక్కువ. అయినప్పటికీ, అదానీ తన పోటీదారుల కన్నా తన సొంత కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల కన్నా తక్కువ జీతం తీసుకున్నారు.
పోర్ట్స్-టు-ఎనర్జీ వంటి 9 లిస్టెడ్ కంపెనీలలో రెండింటి నుంచి జీతాలు పొందారని గ్రూప్ లిస్టెడ్ సంస్థల లేటెస్ట్ యానివల్ రిపోర్టులు సూచించాయి. అదానీ మొత్తం వేతనం మునుపటి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన రూ.9.26 కోట్ల కన్నా 12 శాతం ఎక్కువగా నమోదైంది.
Read Also : MacBook Air M1 : మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
2024-25 సంవత్సరానికి గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి ఆయన పొందిన వేతనంలో రూ.2.26 కోట్లు కాగా, మరో రూ.28 లక్షల పెర్క్విజిట్లు, అలవెన్సులు ఉన్నాయి. ఏఈఎల్ నుంచి మొత్తం ఆదాయం రూ.2.54 కోట్లు ఉంటే.. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.46 కోట్ల కన్నా ఎక్కువ.
అంతేకాదు.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) నుంచి రూ.7.87 కోట్లు, రూ.1.8 కోట్ల వేతనం, రూ.6.07 కోట్ల కమీషన్ అందుకున్నాడు. 2023-24లో ఏపీఎస్ఈజెడ్ నుంచి అదానీ అందుకున్న రూ.6.8 కోట్లతో పోలిస్తే చాలా తక్కువ.
ఈ దిగ్గజాల కన్నా అదానీ జీతమే తక్కువ :
కోవిడ్-19 నుంచి అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ మొత్తం జీతాన్ని తీసుకోవడం లేదు. అంతకుముందు అంబానీ తన జీతాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేశాడు. అయితే, అదానీ జీతం (Gautam Adani) టెలికాం వ్యాపారవేత్త సునీల్ భారతి మిట్టల్ (2023-24లో రూ. 32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2023-24లో రూ. 53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2023-24లో రూ. 109 కోట్లు), ఎల్&టీ చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ (2024-25లో రూ. 76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ఎస్ పరేఖ్ (2024-25లో రూ. 80.62 కోట్లు) కన్నా చాలా తక్కువగా ఉంటుంది.
మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్, ముంజాల్‌కు చెందిన హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటోల లేటెస్ట్ వార్షిక నివేదికలు ఇంకా విడుదల కాలేదు. ప్రపంచ ధనవంతుల జాబితాలో అంబానీ 104 బిలియన్ డాలర్ల నికర విలువతో 17వ స్థానంలో ఉండగా.. అదానీ 20వ స్థానంలో ఉన్నారు.
ఉద్యోగులకు అదానీ కన్నా జీతం ఎక్కువ :
అదానీ జీతం (Gautam Adani) ఆయన గ్రూప్ కంపెనీలలో కనీసం ఒకరు లేదా ఇద్దరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల కన్నా తక్కువగా ఉంది. ఏఈఎల్ సీఈఓ వినయ్ ప్రకాష్ రూ.69.34 కోట్లు అందుకున్నారు. ప్రకాష్ జీతంలో రూ.4 కోట్ల జీతం, రూ.65.34 కోట్ల అలవెన్సులు ఉన్నాయి.
అదేవిధంగా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.4 కోట్లు సంపాదించారు.
గ్రూప్‌లోని లిస్టెడ్ ఎంటిటీల తాజా వార్షిక నివేదిక ప్రకారం.. అదానీ తన వ్యాపార సామ్రాజ్యంలో 9 లిస్టెడ్ కంపెనీలలో పోర్టుల నుంచి ఇంధనం వరకు రెండింటి నుంచి మాత్రమే జీతం తీసుకున్నాడు. 2023-24లో అదానీ మొత్తం రూ.9.26 కోట్ల జీతం అందుకున్నారు.
ఏ కంపెనీ నుంచి ఎంత జీతం వచ్చింది? :
గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2024-25 సంవత్సరానికి ఆయన జీతంలో రూ.2.26 కోట్ల జీతం, అలవెన్సులు, సౌకర్యాలు, ఇతర ప్రయోజనాలు రూ.28 లక్షలతో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) నుంచి రూ.7.87 కోట్లు తీసుకున్నారు. ఇందులో రూ.1.8 కోట్లు జీతం, రూ.6.07 కోట్లు కమీషన్‌గా ఉన్నాయి.