iQOO Z10 Lite
iQOO Z10 Lite : ఐక్యూ అభిమానులకు అదిరే న్యూస్.. ఈ నెల 18న భారత మార్కెట్లోకి ఐక్యూ Z సిరీస్ వచ్చేస్తోంది. ఐక్యూ Z10 లైట్‌ను ఆవిష్కరించనుంది. అమెజాన్‌లో ల్యాండింగ్ పేజీలో కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించింది.
కంపెనీ ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలను రివీల్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ టైటానియం బ్లూ, సైబర్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ కేటగిరీలో ఫస్ట్ IP64-రేటెడ్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు. రాబోయే ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి..
డిజైన్ వివరాలు :
బాక్సీ డిజైన్ ఉండొచ్చు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వర్టికల్ పిల్-షేప్ ఐలాండ్ ఉండొచ్చు. ఫ్లాష్‌లైట్ కూడా ఉంటుంది. ఫోన్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ రైట్ సైడ్, స్పీకర్ గ్రిల్స్ పైనా చూడొచ్చు.
ఐక్యూ Z10 లైట్ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. 70 గంటల మ్యూజిక్, 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ 9.17 గంటల గేమింగ్ సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ అందిస్తుంది.
ఐక్యూ Z10 లైట్ 50MP ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంటుంది. పోర్ట్రెయిట్ షాట్ 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు 5MP కెమెరా ఉంటుంది. ఈ ఐక్యూ ‘ఏఐ ఎరేస్’, ‘ఏఐ ఫొటో ఎన్‌హాన్స్’ సహా అడ్వాన్స్ ఏఐ-ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్‌లతో వస్తుంది.
ఐక్యూ Z10 లైట్ ధర (అంచనా) :
రాబోయే ఐక్యూ Z10 లైట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 10వేలు లోపు ఉంటుందని అంచనా.