iPhone 17 Series : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. మొత్తం 4 మోడల్స్.. కీలక ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?
iPhone 17 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ముందుగానే లాంచ్ టైమ్‌లైన్, ఇతర కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే 4 ఐఫోన్ మోడళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iPhone 17 Series
iPhone 17 Series : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 4 మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఆపిల్ (iPhone 17 Series) ఇప్పటికే iOS 26 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రకటించింది.
ఐఫోన్ 17 సిరీస్ మొత్తం ఇదే అప్‌డేట్‌తో రానున్నాయి. ఈ లైనప్‌లో బేస్ మోడల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ఐఫోన్ మోడల్స్ సెప్టెంబర్ 2025 ప్రారంభంలో లాంచ్ అవుతాయని అంచనా..
కొత్త నివేదిక ప్రకారం.. కొత్త టారిఫ్ ఛార్జీల కారణంగా ఆపిల్ రాబోయే ఐఫోన్ 17 సిరీస్ ధరలను అమెరికాలో పెంచవచ్చు. ఇటీవలి కాలంలో కంపెనీ స్థిరమైన ధరలను కొనసాగిస్తోంది. ఈ ఏడాదిలో ఈ ట్రెండ్ మారవచ్చు.
రాబోయే ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. నివేదికల ఆధారంగా.. ఆపిల్ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13, 2025 మధ్య ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 సిరీస్ ధర (అంచనా) :
గత కొన్ని ఏళ్ల ట్రెండ్స్ ప్రకారం.. ఈ ఏడాది కూడా ఆపిల్ (iPhone 17 Series) ఎంట్రీ లెవల్ ఐఫోన్ల ప్రారంభ ధరను కొనసాగించే అవకాశం ఉంది. ఐఫోన్ 17 రూ. 89,900, ఐఫోన్ 17 ఎయిర్ రూ. 99,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర వరుసగా రూ. 1,39,900, రూ. 1,64,900గా ఉండవచ్చు. కేవలం ఊహాగానాలు మాత్రమే. దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి ధృవీకరించలేదు. కొత్త ఐఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 సిరీస్ డిజైన్, కలర్ ఆప్షన్లు :
డిజైన్ పరంగా.. స్టాండర్డ్ ఐఫోన్ 17 ముందు (iPhone 17 Series) వెర్షన్ ఐఫోన్ 16 మాదిరిగా ఉంటుంది. USB-C పోర్ట్, యాక్షన్ బటన్‌తో వస్తుంది. అయితే, ప్రో వేరియంట్లలో డిజైన్ పిక్సెల్ ఫోన్ మాదిరి రెక్టాంగులర్ కెమెరా ఐలాండ్ బ్యాక్ సైడ్ కలిగి ఉంటాయి. ఈ ఏడాది ఐఫోన్ 17 ప్లస్ మోడల్ ఉండకపోవచ్చు.
కొత్త ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ తీసుకురానుంది. నాన్-ప్రో ఐఫోన్ 17, 17 ఎయిర్ అల్ట్రామెరైన్, టీల్, బ్లాక్, పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో రావచ్చు. ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ బ్లాక్, సిల్వర్, వైట్, కొత్త స్కై బ్లూ కలర్ వేలో వచ్చే అవకాశం ఉంది.
Read Also : Vivo X200 Sale : వివో ఆఫర్ అదుర్స్.. ఇలా చేస్తే వివో X200 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి..!
ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఈ 4 ఐఫోన్లలో మెరుగైన బ్రైట్‌నెస్, 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో OLED డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ఎయిర్‌లో A19 చిప్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే, ఐఫోన్ ప్రో వెర్షన్‌లు A19 ప్రో చిప్‌సెట్‌తో రానుంది.
కెమెరాల విషయానికొస్తే.. అన్ని ఐఫోన్ 17 మోడళ్లలో 24MP సెన్సార్ అప్‌గ్రేడ్ ఉండవచ్చు. బ్యాక్ ప్యానెల్‌లో కొత్త ఐఫోన్ 17 ఎయిర్‌లో సింగిల్ 48MP రియర్ షూటర్ ఉండవచ్చు. ఐఫోన్ 17లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ 8K వీడియో, 7x జూమ్‌తో ట్రిపుల్-లెన్స్ 48MP కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది.