Vivo X200 Sale : వివో ఆఫర్ అదుర్స్.. ఇలా చేస్తే వివో X200 ఫోన్ అతి తక్కువ ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి..!
Vivo X200 Sale : వివో ఫోన్ కొంటున్నారా? రూ. 55వేల లోపు ధరలో వివో X200 ఫోన్ వచ్చేస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo X200 Sale
Vivo X200 Sale : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వివో X200 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ కొనుగోలుపై రూ.11వేల కన్నా ఎక్కువ (Vivo X200 Sale) సేవ్ చేయవచ్చు. ఈ డీల్ అధికారిక వివో స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ డీల్ అందుబాటులో లేదు.
ఈ స్మార్ట్‌ఫోన్ Zeiss ట్యూన్డ్ కెమెరాతో పాటు ఇన్-హౌస్ V3+ ఇమేజింగ్ చిప్, బిగ్ బ్యాటరీ, డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. కంపెనీ అధికారిక ఇ-స్టోర్‌లో వివో X200 ధర డీల్ రూ.65,999కు లభిస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వివో X200 ధర, ఆఫర్లు :
భారత మార్కెట్లో ప్రస్తుతం వివో X200 ఫోన్ ధర రూ.65,999కు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.5,500 తగ్గింపు పొందవచ్చు. మొత్తం ఫోన్ ధర రూ.60,499 అవుతుంది. మీ పాత ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.5,500 డిస్కౌంట్ పొందవచ్చు.
వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్ ఆధారంగా వాల్యూ ఉంటుంది. ఎక్స్ఛేంజ్ వాల్యూతో మొత్తం రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు 15 రోజుల రీప్లేస్‌మెంట్ పాలసీతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు. కంపెనీ రూ. 50వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ అందిస్తోంది.
వివో X200 స్పెసిఫికేషన్లు :
వివో X200 ఫోన్ 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400 SoC ద్వారా పవర్ పొందుతుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంటుంది. 5,800mAh బ్యాటరీని కలిగి ఉంది.
90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP69 రేటింగ్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన జైస్-ట్యూన్ ట్రిపుల్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.