ఎప్పుడు రైలులో ప్రయాణిస్తుంటారా: IRCTC యాప్స్ ట్రై చేయండిలా!

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 06:54 AM IST
ఎప్పుడు రైలులో ప్రయాణిస్తుంటారా:  IRCTC యాప్స్ ట్రై చేయండిలా!

Updated On : December 18, 2019 / 6:54 AM IST

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టికెటింగ్ సేవలతో పాటు అనేక సర్వీసుల్ని అందిస్తోంది. ఈ సేవల్ని అందించేందుకు వేర్వేరు యాప్స్ రూపొందించింది. మీరు ఎప్పుడు ప్రయాణించేవారైతే ఆ యాప్స్ మీ ఫోన్‌లో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ యాప్స్ మీ దగ్గరుంటే IRCTCకి సంబంధించిన సేవలు ఇంకా మెరుగ్గా పొందొచ్చు. మరి ఆ యాప్స్ ఏంటో, వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందామా? 

IRCTC Rail Connect:

ఈ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2014లో IRCTC ఈ యాప్‌ను రిలీజ్ చేసింది. కానీ అప్పుడు ఈ యాప్ ద్వారా నిమిషానికి 2,000 టికెట్లు బుక్ చేసే వీటుంటే.. ఇప్పుడు కొత్త యాప్ ద్వారా నిమిషానికి 20,000 బుక్ చేసుకోవచ్చు. అయితే గతంలో మీరు ఈ యాప్‌ లో రైళ్ల వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా లాగిన్ చేయాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు అవసరం లేదు లాగిన్ చేయకుండానే రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చు.

మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే… Plan My Journey ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ట్యాబ్ క్లిక్ చేసి లాగిన్ అయ్యి.. మీరు ఎక్కడ్నుంచి ఎక్కడికి, ఏ సమయంలొ ప్రయాణించాలనుకుంటున్నారో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. 

IRCTC Air: 

ఈ యాప్ ద్వారా రైల్ టికెట్లు మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం IRCTC ఎయిర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాలిడేస్ కోసం ఎల్‌టీసీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.

IRCTC Tourism: 

ఈ యాప్ ఎక్కువగా హాలిడే టూర్లకు వెళ్లేవారికి ఉపయోగపడుతోంది. IRCTC టూరిజం యాప్ ద్వారా టూర్ ప్యాకేజీలు, హోటళ్లు బుక్ చేయొచ్చు.  మిగతా సంస్థలతో పోలిస్తే చౌకగా నేషనల్, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు. 

Food on Track: 

ప్రయాణంలో ఉండగా ఫుడ్ బుక్ చేసుకొని మీ సీటు దగ్గరకు తెప్పించుకునేందుకు ఉపయోగపడే ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్. ఇందులో మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఫుడ్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందే ఫుడ్ బుక్ చేసినా… మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే మీ ఫుడ్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుంది.

Menu on Rails: 

రైలు ప్రయాణంలో తమకు అందించే ఫుడ్ ఐటమ్స్, వాటి ధరల్ని తెలుసుకోవచ్చు. భారతీయ రైళ్లల్లో IRCTC క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉన్న   రైళ్లలో మెనూ వివరాలుంటాయి.

UTS: 

ఇండియన్ రైల్వేస్ రిలీజ్ చేసిన యూటీఎస్ యాప్ అన్‌ రిజర్వ్‌డ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అన్‌రిజర్వ్‌డ్ అంటే ముందుగా రిజర్వేషన్ చేయించకుండా మీరు రైల్వే స్టేషన్‌ లో తీసుకునే జనరల్ టికెట్‌ ను అన్‌రిజర్వ్‌డ్ టికెట్ అంటారు. దీని ద్వారా టికెట్లను క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. ఈ సేవలు దేశమంతా అందుబాటులో ఉన్నాయి.