ITR e-filing: ITR దరఖాస్తును ఎలా e-file చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్

  • Publish Date - September 10, 2020 / 03:28 PM IST

AY 2020-21 ఆదాయపు పన్ను రాబడి (ITR) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులందరికీ AY 2020-21కు సంబంధించి ITR దాఖలకు చివరి తేదీని 2020 నవంబర్ 30 వరకు పొడిగించారు. AY 2020-21 ఐటిఆర్ ఫారాలను 1-7 వరకు CBDT అందిస్తోంది. ఐటిఆర్ -1 లేదా Sahaj, సాధారణ ఫామ్.. మొత్తం వార్షిక ఆదాయం రూ .50 లక్షల కన్నా తక్కువ, జీతాలు, ఇంటి ఆస్తి, వడ్డీ ఆదాయం, వ్యవసాయ ఆదాయం రూ .5 వేల వరకు ఉన్న నివాసితులకు ఈ ఫామ్ అవసరం.



పన్ను చెల్లింపుదారునికి వ్యాపారం, వృత్తి, మూలధన లాభాలు లేదా ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు ఉంటే మాత్రం వారు ITR-1 ఫారమ్‌ వర్తించదు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఐటిఆర్ ఇ-ఫైలింగ్ విధానం ఎలా చేయాలో ఈ కింది విధంగా ఫాలో అవ్వండి..

1.  ఇ-ఫైలింగ్ పోర్టల్, www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్ళండి.
2. యూజర్ ఐడి (PAN), పాస్‌వర్డ్, Captcha కోడ్‌ను నమోదు చేయండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి. ‘Login’పై క్లిక్ చేయండి
3. క్లిక్ చేయండి ‘e-File’ మెనుపై క్లిక్ చేయండి. ‘Income Tax Return’ లింక్ పై కూడా క్లిక్ చేయండి.

4. ఆదాయపు పన్ను రిటర్న్ పేజీలోకి వెళ్లండి.
* PAN ఆటోమాటిక్ యాడ్ అయి ఉంటుంది.
* అసెస్‌మెంట్ ఇయర్ (AY) ఎంచుకోండి.
* ITR ఫారం నంబర్‌ను ఎంచుకోండి
* ఫైలింగ్ రకాన్ని అసలైన / సవరించిన రిటర్న్‌గా ఎంచుకోండి
* submission మోడ్‌ను ‘ఆన్‌లైన్‌లో సిద్ధం చేసి submit చేయండి.’
5. ‘continue’పై క్లిక్ చేయండి.
6. సూచనలను జాగ్రత్తగా చదవండి. ఆన్‌లైన్ ఐటిఆర్ ఫారంలో అవసరమైన ఫీల్డ్స్ పూర్తి చేయండి.



Note: ఈ పేజీ సెషన్ సమయం ముగిసిన వెంటనే అది క్లోజ్ అయిపోతుంది.. అందుకే డేటా / రీవర్క్ కోల్పోకుండా ఉండటానికి, ఎంటర్ చేసిన ఐటిఆర్ వివరాలను సేవ్ చేయడానికి ‘Draft Save’ బటన్ పై క్లిక్ చేయండి. సేవ్ చేసిన Draft Save చేసిన తేదీ నుండి లేదా రిటర్న్ దాఖలు చేసిన తేదీ వరకు లేదా నోటిఫైడ్ ఐటిఆర్ XML స్కీమాలో అందుబాటులో ఉంటుంది.

7. ‘Taxes Paid and Verification’ టాబ్‌లో తగిన verification ఆప్షన్ ఎంచుకోండి. ITR ను ధృవీకరించడానికి కింది ఆప్షన్‌లో ఏదైనా ఎంచుకోండి.



*  e-Verify చేయాలి.
* దాఖలు చేసిన తేదీ నుండి 120 రోజులలోపు e-Verify చేయాలి.
* e-Verify చేయడం లేదు. సంతకం చేసిన ఐటిఆర్ ఫాం సాధారణ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్, ఆదాయపు పన్ను విభాగం బెంగళూరు – 560500 కు పంపుతున్నాను.

8. Preview and Submit’ బటన్ క్లిక్ చేయండి. ITRలో నమోదు చేసిన మొత్తం డేటాను వెరీఫై చేయండి.
9. ITR ఫాంను Submit చేయండి.
10. I would like to e-Verify’ option ఆప్షన్ ఎంచుకోండి.. EVC / OTP ని నమోదు చేయడం ద్వారా కింది పద్ధతుల ద్వారా e-verification చేయవచ్చు.

EVC బ్యాంక్ ఎటిఎం ద్వారా జనరేట్ అవుతుంది. లేదా ‘My Account’ కింద ‘Generate EVC’ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆధార్ OTP ప్రీవాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్ ప్రీవాలిడేటెడ్ డిమాట్ అకౌంట్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇతర రెండు వెరిఫై ఆప్షషన్లను ఎంచుకోవచ్చు.



అప్పుడు ITR ఎంచుకోవచ్చు. వెరిఫై చేసే వరకు ఐటిఆర్లను దాఖలు చేసేంత వరకు Proecess పూర్తి కాదు. Submit చేసిన ఐటిఆర్ తరువాత ‘my account? ఇ-వెరిఫై రిటర్న్ ఎంపిక లేదా సైన్ చేసిన ఐటిఆర్-Vను బెంగళూరులోని CPCకి పంపాలి.

11. EVC / OTP ను 60 సెకన్లలోపు ఎంటర్ చేయాలి. లేకపోతే, ITR ఆటోమాటిక్‌గా Submit అయిపోతుంది. ఆ తర్వాత ఐటిఆర్ ‘my account? ఇ-వెరిఫై రిటర్న్ ఎంపిక లేదా సైన్ చేసిన ITR-Vను CPCకి పంపించాల్సి ఉంటుంది.