Jio AirFiber Plans : రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు ఇవే.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్.. ధర వివరాలివే!

Jio AirFiber Plans : రిలయన్స్ జియో కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లతో ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ప్రత్యేక సభ్యత్వాల అవసరం లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ బెనిఫిట్స్ అందించడం ఈ సర్వీసు లక్ష్యంగా చెప్పవచ్చు.

Jio AirFiber offers free Netflix and Amazon Prime with select plans

Jio AirFiber Plans : ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, ఇతర అనేక స్ట్రీమింగ్ సర్వీసులతో అన్ని సబ్‌స్క్రిప్షన్‌లు, డేటా ప్లాన్‌లను కొనసాగించడం చాలా కష్టం. ఎందుకంటే ఓటీటీ ప్లాన్లు చాలా ఖరీదైనదిగా ఉంటాయి. అందుకే, వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జియో కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ప్యాకేజీలను తీసుకోవచ్చు. ఇతర ఓటీటీ ప్లాన్‌లతో పాటు కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్‌లను కూడా పొందవచ్చు.  అంతేకాదు.. వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.

Read Also : Xiaomi SU7 Sedan Launch : ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి షావోమీ ఎంట్రీ.. కొత్త SU7 సెడాన్ కారు చూశారా? పూర్తి వివరాలు మీకోసం..!

జియో ఎయిర్‌ఫైబర్ అనేది రిలయన్స్ జియో నుంచి వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసును అందిస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని 5G టెక్నాలజీ ద్వారా అందిస్తుంది. సంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌లకు పోటీగా 1జీబీపీఎస్ వరకు వేగాన్ని అందిస్తుంది. వినియోగదారులు ప్రత్యేక ఓటీటీ సభ్యత్వాలతో పాటు కాలింగ్ అనేక ఓటీటీ బెనిఫిట్స్ సహా 5G ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించవచ్చు. మీరు ఓటీటీ బెనిఫిట్స్‌తో కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ చూస్తున్నట్లయితే.. కాలింగ్, డేటా, ఓటీటీ బెనిఫిట్స్ అందించే జియో ప్లాన్‌లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.

జియో ఎయిర్‌ఫైబర్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌తో ప్లాన్ :
జియో ఎయిర్‌ఫైబర్ రూ. 1199 ప్లాన్ : 100ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 550+ డిజిటల్ ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియోసినిమా ప్రీమియం మరిన్ని వంటి వివిధ ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు ఉంటాయి.

జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూ. 1499 : ఎంచుకున్న ప్రదేశాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ మ్యాక్స్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో 300ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. 550+ డిజిటల్ ఛానెల్‌లు, నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్, జీ5 ఇతర ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను కలిగి మరెన్నో బెనిఫిట్స్ అందిస్తుంది.

జియో ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ రూ. 2499 : 30 రోజుల పాటు 500 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ని కలిగి ఉంటుంది, ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లైవ్, జీ5 మరిన్ని వంటి 550+ డిజిటల్ ఛానెల్‌లు, ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ అందిస్తుంది.

Jio AirFiber offer plans

జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ రూ. 3999 : 30 రోజుల పాటు హై-స్పీడ్ 1జీబీపీఎస్ ఇంటర్నెట్‌ని అందిస్తోంది, ఈ ప్లాన్‌లో 550+ డిజిటల్ ఛానెల్‌లు, నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లైవ్, జీ5 ఇతర ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది.

జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉన్న నగరాలివే :
సెప్టెంబర్ 19, 2023న 8 నగరాల్లో ప్రారంభమైన తర్వాత రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని 115 నగరాలకు వేగంగా విస్తరించిందని టెలికాం టాక్ తెలిపింది. జియో ఎయిర్‌ఫైబర్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు పరిధిని విస్తరించింది.

అదేవిధంగా, మహారాష్ట్రలో ఈ సర్వీసు ముంబై, పూణే, నాగ్‌పూర్, నాందేడ్, నాసిక్‌లలో అందుబాటులో ఉంది. ఎయిర్‌ఫైబర్ కవరేజ్ అనేక రాష్ట్రాలలో అనేక నగరాలకు విస్తరించింది. రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ కనెక్టివిటీని మరింత విస్తరించవచ్చు. 2023 చివరి నాటికి మరిన్ని నగరాలను చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి మై జియో యాప్ లేదా రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

జియో ఎయిర్‌ఫైబర్ ఎలా బుక్ చేయాలి? :

జియో వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా మై జియో యాప్‌ని ఉపయోగించడం ద్వారా లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించడం ద్వారా మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో ధృవీకరించండి.
* మీరు వివిధ ఛానెల్‌ల ద్వారా బుకింగ్ ప్రక్రియను మొదలుపెట్టవచ్చు.
* 60008-60008కి మిస్డ్ కాల్ డయల్ చేయండి.
* జియో వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం లేదా మై జియో యాప్‌ని ఉపయోగించండి.
* మీ సమీపంలోని జియో స్టోర్‌ని సందర్శించండి.

జియో ఎయిర్‌ఫైబర్ కోసం రిజిస్టర్ చేసుకోండి :
కన్ఫర్మేషన్ కోసం వేచి ఉండండి : మీ భవనం లేదా ప్రదేశంలో సర్వీసు అందుబాటులోకి వచ్చినప్పుడు జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది. మీ బుకింగ్ నిర్ధారణ తర్వాత వై-ఫై రూటర్, 4కె స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్, అవుట్‌డోర్ యూనిట్‌తో సహా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కిట్‌ను అందుకుంటారు.

Read Also : China Fastest internet : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్.. ఒక సెకనులో టైగర్ 3 మూవీని 150 సార్లు డౌన్‌లోడ్ చేయొచ్చు!

ట్రెండింగ్ వార్తలు