Jio Airtel 5G : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ స్మార్ట్‌ఫోన్ 5G సపోర్టు చేస్తుందో లేదో ఇలా చెక్ చేయొచ్చు!
Jio Airtel 5G : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio 5G), ఎయిర్‌టెల్ (Airtel 5G) సర్వీసులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభించాయి.

Jio and Airtel 5G now available how to check if your smartphone has 5G support
Jio Airtel 5G : ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio 5G), ఎయిర్‌టెల్ (Airtel 5G) సర్వీసులు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభించాయి. Airtel 5G ఇప్పటికే గత వారం నుంచి 8 నగరాల్లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 5 నుంచి Jio 5G సర్వీసులు 4 నగరాల్లో అందుబాటులోకి వస్తుంది.
అన్ని స్మార్ట్‌ఫోన్‌లు Airtel లేదా Jio 5Gకి సపోర్టుకు అందుబాటులో లేదని గుర్తించాలి. 5G నెట్‌వర్క్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే Jio, Airtel నుంచి 5G సర్వీసులకు సపోర్టు అందిస్తాయి. సరళంగా చెప్పాలంటే.. ప్రస్తుతం 2G, 3G లేదా 4G స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న వ్యక్తులు హైస్పీడ్ 5G సర్వీసును ఆస్వాదించలేరు. మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు ఇస్తుందా? కచ్చితంగా తెలియదా? మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు ఇస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.

Jio and Airtel 5G now available how to check if your smartphone has 5G support
మీ ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోండి :
* మీ ఫోన్‌లో, సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి.
* ‘Wi-Fi & Network’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ‘SIM & నెట్‌వర్క్’ ఆప్షన్‌పై Click చేయండి.
* ‘ప్రాధాన్య నెట్‌వర్క్’ ఆప్షన్ కింద అన్ని టెక్నికల్ లిస్టును చూడవచ్చు.
* మీ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తే.. 2G/3G/4G/5Gగా లిస్టు కనిపిస్తుంది.
మీరు Airtel లేదా Jio 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేస్తాయి. మీరు ఉండే ప్రాంతంలో హైస్పీడ్ ఇంటర్నెట్ 2G/3G/4G/5G ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు. మీరు 5G నెట్‌వర్క్ ముందుగా 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలి. అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వివిధ ధరల పాయింట్లలో 5G స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. వాస్తవానికి.. Realme, Lava వంటి బ్రాండ్‌లు రూ.10వేల లోపు 5G ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించాయి. ఈ రోజు నుంచి రిలయన్స్ జియో కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, వారణాసితో సహా 4 నగరాల్లో బీట్ ట్రయల్‌గా 5G సర్వీసును లాంచ్ చేస్తోంది.

Jio and Airtel 5G now available how to check if your smartphone has 5G support
మరోవైపు.. ఎయిర్‌టెల్ ఢిల్లీ, వారణాసి, నాగ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, సిలిగురితో సహా 8 నగరాల్లో 5G సర్వీసులను అందిస్తోంది. మార్చి 2024 నాటికి 5G సర్వీసుల పాన్ ఇండియాలో అందుబాటులోకి వస్తుందని Airtel CEO ఇటీవల ధృవీకరించారు. అయితే, Jio 5G డిసెంబర్ 2023 నాటికి అందరికీ అందుబాటులో ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..