Jio Recharge Plans
Jio Cheapest Plan : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. సింగిల్ రీఛార్జ్‌తో లాంగ్ వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి రీఛార్జ్ చేస్తే (Jio Cheapest Plan) ఏకంగా 11 నెలల పాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. జియో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు దాదాపు ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. కేవలం రూ. 900 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
జియో అందించే ఈ చౌకైన ప్లాన్ ధర కేవలం రూ. 895 మాత్రమే. అంతేకాదు.. మరోన్నో జియో రీఛార్జ్ ప్లాన్లను కూడా అందిస్తోంది. కస్టమర్ల సౌలభ్యం కోసం జియో రీఛార్జ్ ప్లాన్‌లను అనేక కేటగిరీలుగా విభజించింది. జియో అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లలో తక్కువ ధరకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ దాదాపు ఏడాది వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 900 కన్నా తక్కువే. అంటే.. ధర రూ. 895 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు కేవలం రూ. 2.66 మాత్రమే. మీరు రోజుకు రూ. 3 కన్నా తక్కువతో డేటా, ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.
ఫ్రీ OTTతో జియో ప్రీపెయిడ్ ప్లాన్లు :
టెలికాం కంపెనీలు ప్రీ OTT బెనిఫిట్స్ అందిస్తున్నాయి. రిలయన్స్ జియో కూడా అనేక రీఛార్జ్ టారిఫ్‌లను అందిస్తోంది. మీరు నెట్‌ఫ్లిక్స్ నుంచి అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వరకు అన్నింటికి యాక్సెస్ పొందవచ్చు. మీరు ఇందులో ఏ ప్లాన్ ఎంచుకుంటారో మీదే ఛాయిస్..
జియో రూ.198 ప్లాన్ :
జియో చౌకైన ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ కేవలం 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌లకు యాక్సెస్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పొందవచ్చు.
రూ. 200 లోపు జియో, ఎయిర్‌టెల్, Vi బెస్ట్ ప్లాన్లు :
ప్రతినెలా రీఛార్జ్ కోసం అతిగా ఖర్చుగా పెడుతున్నారా? కాలింగ్, డేటా, SMS అన్ని బెనిఫిట్స్ ఒకే ప్లానులో పొందవచ్చు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా రూ. 200 కన్నా తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా, SMS వంటి అనేక అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.