Jio Offer : నెలవారీ రీఛార్జ్‌‌లతో విసిగిపోయారా? ఈ 2 జియో ప్లాన్లతో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

Jio Offer : జియో రెండు లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. 336 రోజుల వ్యాలిడిటీ, 200 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతున్నాయి.

Reliance Jio offers

Jio Offer : రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో (Jio Offer) లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో కస్టమర్ బేస్‌లో టాప్‌లో ఉండటమే కాదు.. వైడ్ రేంజ్ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది.

Read Also : Best Smartphones : ఈ ఫోన్లు చాలా చీప్ గురూ.. రూ. 8వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

ప్రస్తుతం జియో రెండు ప్రత్యేక ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియో అందించే లాంగ్ టైమ్ ప్లాన్‌లలో కంపెనీ 84 రోజులు, 90 రోజులు, 98 రోజులు, 365 రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి. 336 రోజుల వ్యాలిడిటీతో పాటు 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను ఓసారి పరిశీలిద్దాం..

జియో 336 రోజుల వ్యాలిడిటీ :
జియో 336 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్. రూ. 1,748 ధరకు ఏడాది పొడవునా పొందొచ్చు. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్స్ అనుమతిస్తుంది.

ఏ నెట్‌వర్క్‌లోనైనా మొత్తం 3,600 ఫ్రీ SMS పొందవచ్చు. వాయిస్, SMS సర్వీసులు మాత్రమే. ఈ ప్లాన్‌లో డేటా రాదు. జియో టీవీ యాక్సెస్, ఆన్‌లైన్ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి కొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.

జియో 200 రోజుల వ్యాలిడిటీ :
జియో ఇంటర్నెట్ డేటాతో లాంగ్-వ్యాలిడిటీ (Jio Offer) ప్లాన్‌ అందిస్తోంది. 200 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. రూ. 2,025 ధరకే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. 200 రోజుల పాటు లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత రూ. 2వేలు పడే ముందు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

కస్టమర్లు ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 ఫ్రీ SMS కూడా పొందవచ్చు. జియో 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్‌ కూడా పొందొచ్చు.