Best Smartphones : ఈ ఫోన్లు చాలా చీప్ గురూ.. రూ. 8వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Best Smartphones : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకోసం 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Smartphones : ఈ ఫోన్లు చాలా చీప్ గురూ.. రూ. 8వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

Best Smartphones

Updated On : May 19, 2025 / 1:28 PM IST

Best Smartphones : స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం అదిరిపోయే ఫోన్లు.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్ కొనుగోలు చేసేవారు కొనేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండా అనేక బడ్జెట్ ఫోన్లు (Best Smartphones) మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఈ ఫోన్‌లు సిల్కీ-స్మూత్ డిస్‌ప్లేను అందిస్తాయి, వీడియో-వాచింగ్, యాప్-స్క్రోలింగ్ లేదా క్యాజువల్ గేమింగ్‌కు బెస్ట్ ఫోన్లుగా చెప్పొచ్చు. రూ.8వేల లోపు ఈ హై-ఎండ్ ఫీచర్‌ ఫోన్లపై ఓసారి లుక్కేయండి.

Read Also : Apple iPhone 14 : వారెవ్వా.. ఐఫోన్ అదుర్స్.. ఇలా చేస్తే.. కేవలం రూ.54,999కే ఐఫోన్ 14 మీ సొంతం..

టెక్నో స్పార్క్ గో 1 :
టెక్నో స్పార్క్ గో 1 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్, ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందిస్తుంది. 4GB ర్యామ్‌తో పాటు యూనిసోక్ T615 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

13MP ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ, USB టైప్-C పోర్ట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌ అందిస్తుంది. సరసమైన ధరకు బెస్ట్ కెమెరా, ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో వస్తుంది. ఈ టెక్నో ఫోన్ ధర రూ.7,299కు అందుబాటులో ఉంది.

రెడ్‌‌మి A4 :
రెడ్‌మి A4 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జనరేషన్ 2 ప్రాసెసర్, 4GB ర్యామ్ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.88-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.

50MP రిజల్యూషన్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్, 5MP ఫ్రంట్ కెమెరాతో పాటు హై రిజల్యూషన్ కెమెరాను కలిగి ఉంది. 5160mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్-C ఆప్షన్ ఉంది. రెడ్‌మి ఫోన్ ధర రూ.7,999కు కొనేసుకోవచ్చు.

ఐటెల్ A80 :
120Hz రిఫ్రెష్ రేట్ చౌకైన స్మార్ట్‌ఫోన్‌లలో ఐటెల్ A80 ఒకటి. 6.67-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. యూనిసోక్ T603 ప్రాసెసర్, 4GB ర్యామ్‌తో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ఫోన్ రింగ్ ఎల్‌ఈడీ 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో సపోర్ట్ అందిస్తుంది. హై కెమెరా రిజల్యూషన్, స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐటెల్ A80 ధర రూ.6,999కు కొనేసుకోవచ్చు.

పోకో C71 (128GB) :
పోకో C71 ఫోన్ 128GB మోడల్ అద్భుతమైన డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ పోకో 6.88-అంగుళాల హెచ్‌డీ ప్లస్, ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. 6GB ర్యామ్‌తో యూనిసోక్ T7250 ద్వారా పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

బ్యాక్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో 32MP డ్యూయల్ షూటర్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8MPతో ఫాస్ట్ ఛార్జింగ్, యూఎస్‌బీ టైప్-Cపోర్ట్‌, 5200mAh బ్యాటరీతో వస్తుంది. పోకో C71 ఫోన్ ధర రూ.7,576కు కొనేసుకోవచ్చు.

పోకో C75 :
పోకో C75 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జనరేషన్ 2 ప్రాసెసర్, 4GB ర్యామ్ కలిగి ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ IPS ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.

కెమెరాల విషయానికి వస్తే.. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5160mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ కూడా ఉంది. ఇంతకీ ఈ ఫోన్ ధర రూ.8,199 మాత్రమే.

Read Also : Aadhaar Update : మీ ఆధార్ ఇంకా అప్‌డేట్ చేయలేదా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఎలా చేయాలి? ఎక్కడంటే?

120Hz స్క్రీన్ 60Hz స్క్రీన్ కన్నా రెండు రెట్లు వేగంగా ఉంటుంది. స్క్రోలింగ్, యానిమేషన్, ట్రాన్సిషన్ లుక్ కలిగి ఉంది. సరసమైన స్మార్ట్‌ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. పై ఫోన్లలో ఐటెల్ A80 మినహా అన్ని ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉన్నాయి.