Jio SIM active for 365 days
Jio Offer : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ప్రతినెలా రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు.. ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 365 రోజుల పాటు ఉచితంగా ఫోన్ కాల్స్, హైస్పీడ్ డేటాను పొందవచ్చు. భారీ డేటా బెనిఫిట్స్ కోసం జియో రూ. 3,599 ప్లాన్ అద్భుతమైన ఆప్షన్. OTT సబ్‌స్క్రిప్షన్‌లు, క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
వర్క్, ఎంటర్‌టైన్మెంట్ రెండింటికీ ఫుల్ ప్యాకేజీ. భారత మార్కెట్లో 46 కోట్లకు పైగా యూజర్లతో అగ్రగామి టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో మీ సిమ్ ఏడాది పొడవునా యాక్టివ్‌గా ఉండేలా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మీరు తరచుగా రీఛార్జ్‌లతో విసిగిపోతే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ కోరుకుంటే ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
జియో చౌకైన వార్షిక రీఛార్జ్ ప్లాన్ :
జియో 365 రోజుల ప్లాన్ యూజర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా జియో రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. టెలికాం దిగ్గజం ఇప్పుడు 90 రోజులు, 98 రోజులు, 72 రోజులు, 365 రోజుల ప్లాన్‌లతో సహా మల్టీ వ్యాలిడిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో రూ. 3,599 వార్షిక ప్లాన్ ఏడాది పొడవునా ఎలాంటి అంతరాయం లేకుండా 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
జియో రూ.3,599 వార్షిక ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
ఈ 365 రోజుల ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ నుంచి హై-స్పీడ్ డేటా వరకు అన్ని బెనిఫిట్స్ అందిస్తోంది.
అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ : ఏడాది పొడవునా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లోకల్, STD కాల్స్ పొందండి.
రోజుకు 100 SMS : అదనపు ఖర్చు లేకుండా అన్ని నెట్‌వర్క్‌లలో మెసేజ్‌లను పంపుకోవచ్చు.
భారీ డేటా బెనిఫిట్స్ : రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను పొందండి. ఏడాది పొడవునా మొత్తం 912GB డేటాను పొందండి. రోజువారీ లిమిట్ తర్వాత కూడా 64Kbps స్పీడ్ డేటా పొందవచ్చు.
జియో ట్రూ5G ఆఫర్ : అందుబాటులో ఉన్న చోట జియో 5G నెట్‌వర్క్‌తో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఫ్రీ OTT, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రిలయన్స్ జియో కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాదు.. ప్రీమియం ఎంటర్‌టైన్మెంట్, క్లౌడ్ స్టోరేజ్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.
ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ :
మరిన్ని ప్రీమియం బెనిఫిట్స్ కోసం చూస్తున్న యూజర్ల కోసం జియో రూ.3,999 వార్షిక ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కనెక్టివిటీని కోరుకునే వారికి రూ.3,599 ప్లాన్ అందుబాటులో ఉంది.