JIO Internet : ఒక్క క్లిక్‌‌తో 3 గంటల సినిమా డౌన్‌‌లోడ్

ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఎంట్రీతో ఇంటర్‌నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిజిటల్‌ ప్రపంచంలో మరోసారి తనదైన మార్క్‌...

JIO Internet : ఒక్క క్లిక్‌‌తో 3 గంటల సినిమా డౌన్‌‌లోడ్

Reliance Jio Offers Unlimited Two Day Complimentary Plan To Affected Users After

Updated On : February 14, 2022 / 1:41 PM IST

Jio To Provide Satellite – Broadband Services :  ఒక్క క్లిక్‌తో 3గంటల సినిమా డౌన్‌లోడ్‌ ఐపోతుంది..! మారుమూల పల్లెల్లోనూ ఇంటర్‌నెట్ సేవలు పరుగులు తీస్తాయి. అటవీ ప్రాంతాల్లోనూ వాయువేగంతో డేటా డౌన్‌లోడ్ అయిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్వర్‌ డౌన్‌ ఫిర్యాదులు అసలు ఉండనే ఉండవు..! ప్లేస్‌ ఏదైనా.. పని ఏదైనా.. సెకన్‌ కంటే తక్కువ టైమ్‌లోనే పూర్తవడం పక్కా..! ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100GBPS స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ రావడమంటే మాముల విషయం కాదు..! దేశంలోని ఏ మూలకైనా డైరెక్ట్‌గా స్పేస్ నుంచే ఇంటర్నెట్. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఫుల్ ఇంటర్నెట్ సిగ్నల్‌..! దేశంలో ఇంటర్‌నెట్‌ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్‌ జియో శాటిలైట్‌ బ్రాడ్‌బాండ్‌ అందించేందుకు రెడీ అయ్యింది.

Read More : Hyderabad : కాలుష్యం నుంచి బయటపడుతున్న మూసీ, హుస్సేన్ సాగర్‌లు

ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఎంట్రీతో ఇంటర్‌నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిజిటల్‌ ప్రపంచంలో మరోసారి తనదైన మార్క్‌ చూపించేందుకు తహతహలాడుతున్న రిలయన్స్‌.. ఈ సారి అంతర్జాతీయ దిగ్గజ సంస్థతో జత కట్టింది. దేశంలో శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ను తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. లక్సెంబర్గ్‌కు చెందిన SES కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. జియో ఫ్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్ SES కలిపి… జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ జాయింట్ వెంచర్‌లో జియోకు 51 శాతం వాటా, SESకు 49 శాతం వాటా ఉంటుంది.ఈ జాయింట్ వెంచర్ ద్వారా దేశవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సర్వీసులు అందించబోతున్నారు. 100GBPS స్పీడ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Read More : State Of Equality : రామానుజచార్యుల సువర్ణమూర్తి.. ప్రాణప్రతిష్ట, ఇక నిత్యారాధనలు

దేశవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటైనట్టు రెండు సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. జియో స్పేస్ టెక్నాలజీ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి జియో ఫ్లాట్‌ఫామ్స్, SES సంస్థలు. అత్యాధునిక శాటిలైట్ టెక్నాలజీతో బ్రాడ్‌బాండ్‌ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశంలోని ఏ మూలకైనా శాటిలైట్ నుంచే ఇంటర్నెట్ సర్వీసులు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ ఆర్బిట్ స్పేస్ నెట్‌వర్క్స్‌ ద్వారా సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాటిలైట్‌ కంటెంట్ కనెక్టివిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న SES సంస్థతో జియో ఈ డీల్‌ కుదుర్చుకోవడం డిజిటల్‌ ఇండియాకు మరింత దోహదం చేస్తుందన్నారు జియో డైరక్టర్‌ అకాశ్‌ అంబానీ.