Reliance Jio
Jio vs Airtel : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఎయిర్‌టెల్, జియో యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. 28 రోజులు లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ప్రతినెలా అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రతి నెలా అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లను ఎంచుకోవాలంటే కష్టమే. అందులోనూ రోజువారీ డేటా ఎక్కువగా వినియోగించే వినియోగదారులు ఖరీదైనవి కూడా. అందుకే లాంగ్ టైమ్ వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారులకు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి.
ఎందుకంటే.. ఈ ప్లాన్లను ఒకసారి తీసుకుంటే చాలు.. ఏడాది 365 రోజులు మళ్లీ రీఛార్జ్ చేయాల్సి అవసరం ఉండదు. తద్వారా నెలవారీ అయ్యే ఖర్చుపై భారీగా ఆదా చేయొచ్చు. పైగా ఈ వార్షిక ప్లాన్లతో రోజువారీ 5G డేటా, ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు :
జియో రూ. 3,999 ప్లాన్ :
జియో, ఎయిర్‌టెల్ రెండూ 365 రోజుల వ్యాలిడిటీతో మల్టీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండూ టాప్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నాయి. జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 3,999 ప్లాన్ రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS అందిస్తుంది. అన్‌లిమిటెడ్ 5G డేటా, జియోహాట్‌స్టార్ మొబైల్ టీవీకి 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. 50GB ఫ్రీ జియోక్లౌడ్ స్టోరేజీని కూడా పొందవచ్చు.
జియో రూ. 3,599 ప్లాన్ :
జియో రూ. 3,599 ప్లాన్ కూడా 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ 5Gతో జియోహాట్‌స్టార్ మొబైల్/టీవీకి 90 రోజుల యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో 50GB ఫ్రీ జియోఏఐక్లౌడ్ స్టోరేజీ కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
ఎయిర్‌టెల్ రూ. 3,999 ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే రూ.3,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రూ. 499 విలువైన ఏడాది జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
హాలోట్యూన్‌లకు ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో ఫ్రీ కంటెంట్‌ను పొందవచ్చు. ఇందులో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందలేరు. ఈ ప్లాన్ ద్వారా 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 3,599 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో వస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు ఫ్రీ హాలోట్యూన్‌లతో పాటు 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 2,249 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 2,249 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా అవసరం లేని యూజర్లకు బెస్ట్. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు మొత్తం 365 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 30GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో సంవత్సరమంతా 3,600 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఫ్రీ హాలోట్యూన్‌లు, 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 1,849 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 1,849 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఏడాది మొత్తం 3,600 SMS అందిస్తుంది. ఫ్రీ హెలోట్యూన్‌లు, పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐకి 12 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. అయితే, ఈ ప్లాన్ ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. మొబైల్ ఇంటర్నెట్ కన్నా కాలింగ్, అప్పుడప్పుడు SMSలపై ఆధారపడే యూజర్లకు సరైనది.
జియో, ఎయిర్‌టెల్ ఏది బెస్ట్ అంటే? :
జియో, ఎయిర్‌టెల్ వార్షిక ప్రీపెయిడ్ ఆఫర్లతో పోలిస్తే.. హై-స్పీడ్ డేటా, క్లౌడ్ స్టోరేజ్ ఇష్టపడే యూజర్లకు జియో బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రూ. 3,999 నుంచి రూ. 3,599 ప్లాన్‌లతో రోజుకు 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ 5G, 50GB (JioAICloud) స్టోరేజ్‌ను అందిస్తోంది. OTT బెనిఫిట్స్ కోరుకునే భారీ డేటా యూజర్లకు బెస్ట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు.. ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్‌లలో మరిన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రత్యేకించి హైడేటా వాడే యూజర్లు, వాయిస్-సెంట్రిక్ ప్లాన్‌లను ఇష్టపడే వారికి బెస్ట్. రూ. 3,999 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్, పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐతో ఏడాది మొత్తం సర్వీసులు పొందవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ కోరుకునే డేటా యూజర్లకు జియో బెస్ట్ ఆప్షన్. ఎయిర్‌టెల్ లాంగ్ టైమ్ OTT బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.