Best Battery Life Phones : ఇలాంటి ఫోన్లు వదలొద్దు.. రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ బ్యాటరీ లైఫ్ అందించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ లిస్ట్..!
Best Battery Life Phones : లాంగ్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? రూ.30వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

Best Battery Life Phones
Best Battery Life Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్లు కావాలా? చాలామంది ఇదే కోరుకుంటారు. మంచి బ్యాటరీ (Best Battery Life Phones) బ్యాకప్ ఉంటే కొనేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేవారి కోసం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి.
2025లో బెస్ట్ బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. రూ. 30వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ లైఫ్ అందించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల జాబితాను అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
1. పోకో F7 :
పోకో F7 అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. గేమింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ కోసం అద్భుతమైన ఫోన్. ఈ ఫోన్ 7550mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక రోజుకు మించి ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉంటుంది. ఈ పోకో ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. గంటలోపు 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. ట్రావెల్ సమయంలో ఈ పోకో ఫోన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2. వివో T4, ఐక్యూ Z10 :
వివో T4, ఐక్యూ Z10 అనే ఈ రెండు ఫోన్లు 7300mAh బ్యాటరీలతో వస్తాయి. ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్లు లేదా గంటల తరబడి బయట బిజీగా గడిపేవాళ్లకు బెస్ట్ ఫోన్లు. మీ ఫోన్‌ను ఎక్కువగా వాడినా రోజుంతా ఛార్జింగ్ వస్తుంది.
ఈ రెండూ ఫోన్లలో 90W ఛార్జింగ్ సపోర్టు ఉంది. బ్యాటరీ తొందరగా ఛార్జ్ అవుతుంది. దాదాపు 40 నిమిషాల్లోనే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. లాంగ్ టైమ్ బ్యాటరీ వినియోగానికి వివో T4, ఐక్యూ Z10 బెస్ట్ ఫోన్లుగా చెప్పొచ్చు.
3. ఐక్యూ నియో 10R :
గేమింగ్ కోసం ఐక్యూ నియో 10R అద్భుతమైన ఫోన్. అన్ని ఫోన్‌లలో కన్నా అత్యంత స్టేబుల్ 90fpsని కలిగి ఉంది. 6500mAh బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అందిస్తుంది. ఈ ఫోన్ 80W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇతర ఫోన్‌ల కన్నా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కానీ, మీ ఫోన్‌ను 20 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
4. పోకో X7 ప్రో :
కంటెంట్, మ్యూజిక్ లేదా క్యాజువల్ బ్రౌజింగ్ కోసం పోకో X7 ప్రో అద్భుతమైన ఫోన్. 6000mAh బ్యాటరీతో వస్తుంది. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కారణంగా ఎక్కువ ఛార్జింగ్ వస్తుంది. 30 నిమిషాల యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్ కూడా అందిస్తుంది.
ఈ పోకో ఫోన్ బ్యాటరీ లైఫ్‌లో దాదాపు 3 నుంచి 4 శాతం మాత్రమే ఎంప్టీ అవుతుంది. ఫుల్ మూవీ చూడవచ్చు. సోషల్ మీడియాను స్క్రోల్ చేయవచ్చు. మీ స్నేహితులతో చాట్ చేయవచ్చు. అయినా రోజులో ఇంకా బ్యాటరీ ఛార్జ్ మిగిలి ఉంటుంది. 90W ఛార్జింగ్‌తో వస్తుంది. 45 నిమిషాలలోపు ఫుల్ ఛార్జ్ అవుతుంది.
5. రియల్‌మి P3 ప్రో, P3 అల్ట్రా :
రియల్‌మి P3 ప్రో, రియల్‌మి P3 అల్ట్రా క్లీన్ డిజైన్, పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీని కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్లు. 6000mAh బ్యాటరీతో ఈ రెండు ఫోన్‌లు ఒక రోజు కన్నా ఎక్కువ ఛార్జింజ్ అందిస్తాయి. పవర్ సేవింగ్ ఫీచర్లు, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌తో వస్తాయి.
ఈ ఫోన్‌లు ఎక్కువసేపు ఛార్జ్ ఉంటాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తాయి. లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే యూజర్లకు ఈ ఫోన్లు అద్భుతంగా ఉంటాయి. రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్లుగా చెప్పవచ్చు.