BSNL Recharge Plan : BSNL బంపర్ ఆఫర్.. చీపెస్ట్ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ OTT బెనిఫిట్స్, రోజుకు డేటా ఎంతంటే?
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్.. అన్ లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ OTT, రోజుకు హైస్పీడ్ డేటా పొందవచ్చు.

BSNL Recharge Plan
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL Recharge Plan తీర్థయాత్రకు వెళ్లేవారి కోసం పాకెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 249 మాత్రమే. ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి BSNLకి తమ నంబర్‌ను పోర్ట్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
BSNL రాజస్థాన్ అధికారిక ఎక్స్ వేదికగా ఈ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కొనుగోలుపై అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నేషనల్ రోమింగ్, 2GB రోజువారీ హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలతో 45 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.
“మీ బడ్జెట్‌లో ధరలోనే అనేక సరసమైన మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రూ. 249/ ఎంట్రీ ప్లాన్ ద్వారా #BSNL4G సర్వీసులతో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. కొత్త సిమ్ కోసం సమీపంలోని రిటైలర్ లేదా BSNL కన్స్యూమర్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. BSNL (MNP)కి పోర్ట్-ఇన్ చేయవచ్చు. మీ పాత బీఎస్ఎన్ఎల్ 2G/3G సిమ్‌ను #4Gకి అప్‌గ్రేడ్ చేయవచ్చు” అని పోస్ట్ పేర్కొంది.
BiTV యాప్‌తో ఫ్రీ OTT యాక్సెస్ :
ఈ ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ BiTV OTT యాప్‌కు ఫ్రీ యాక్సెస్ కూడా అందిస్తుంది. 400 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్, వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను యాక్సస్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 2G/3G సిమ్‌లను 4G/5G సిమ్‌లకు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
అమర్‌నాథ్ యాత్రికుల కోసం ప్రత్యేక యాత్ర సిమ్ కార్డు :
బీఎస్ఎన్ఎల్ కొత్త రూ.249 ప్లాన్‌తో పాటు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం రూ.196 ధరకే ప్రత్యేక యాత్ర సిమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ సిమ్ 15 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో యాత్రికులు తమ కుటుంబాలతో కనెక్ట్ అయి ఉండొచ్చు.
భారత్ అంతటా సరసమైన కనెక్టివిటీ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగల వినియోగదారులు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, OTT ఎంటర్‌టైన్మెంట్, రోమింగ్‌తో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ. 249 ధరకే పొందవచ్చు. 4G/5G నెట్‌వర్క్ విస్తరణతో పాటు యాత్రా సిమ్ వంటి ప్రత్యేక సర్వీసులను యాత్రికుల కోసం అందిస్తోంది.