JioBook Laptop : రూ. 16,499కే కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్.. అద్భుతమైన ఫీచర్లు.. కొంటే ఇలాంటి ల్యాప్‌టాప్ కొనాలి.. సేల్ ఎప్పటినుంచంటే?

JioBook Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి సరసమైన ధరకే కొత్త జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని కలిగి ఉంది.

JioBook Laptop launched at Rs 16,499 with 100GB free cloud storage

JioBook Laptop : డిజిటల్ ఎకోసిస్టమ్‌ను విస్తరించడంలో భాగంగా రిలయన్స్ జియో (Reliance Jio) భారత మార్కెట్లో సరికొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను రూ. 16,499 సరసమైన ధరకు లాంచ్ చేసింది. ప్రాథమిక ల్యాప్‌టాప్‌తో పాటు డిజిబాక్స్‌లో 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ స్థలాన్ని కూడా పొందవచ్చు. ఒక ఏడాది పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు, సేల్‌కు సంబంధించి వివరాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కొత్త జియో ల్యాప్‌టాప్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB LPDDR4 ర్యామ్‌తో వచ్చింది. JioBook మృదువైన మల్టీ టాస్కింగ్, సమర్థవంతమైన పర్ఫార్మెన్స్ అందించగలదని కంపెనీ టీజర్‌లలో పేర్కొంది. 64GB స్టోరేజీని అందిస్తుంది. SD కార్డ్‌తో 256GB వరకు విస్తరించుకోవచ్చు. JioBook ముఖ్య ఫీచర్లలో ఒకటి ఇన్ఫినిటీ కీబోర్డ్, భారీ మల్టీ ట్రాక్‌ప్యాడ్ వంటివి ఉన్నాయి. ఈ జియో ల్యాప్‌టాప్ ఇంటర్నల్ USB, HDMI పోర్ట్‌లతో కూడా వస్తుంది. వినియోగదారులు ఎక్స్‌ట్రనల్ డివైజ్‌లు, పెరిఫెరల్స్‌కు కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.

కంపెనీ JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తున్న JioBook యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 4G కనెక్టివిటీ, డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి సపోర్టు అందిస్తుంది. కొత్త ల్యాప్‌టాప్ 990 గ్రాముల బరువుతో అల్ట్రా-స్లిమ్, తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉందని జియో తెలిపింది. 11.6-అంగుళాల కాంపాక్ట్ యాంటీ-గ్లేర్ HD డిస్ప్లేను కలిగి ఉంది.

Read Also :  Motorola G14 Launch : ఆగస్టు 1న మోటో G14 ఫోన్ వచ్చేస్తోంది.. 5G రేంజ్‌లో ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

JioBook అత్యంత పోర్టబుల్ అని సూచిస్తుంది. ఈ జియో ల్యాప్‌టాప్ అన్ని వయస్సుల వారు వినియోగించేలా ఉంటుంది. ఎంటర్‌టైన్మెంట్ కోసం మాత్రమేనని అమెజాన్ టీజర్ పేర్కొంది. 4G కనెక్టివిటీతో పాటు ఆక్టా-కోర్ ప్రాసెసర్‌కు సపోర్టు కలిగి ఉంది. హై-డెఫినిషన్ వీడియోల స్ట్రీమింగ్, అప్లికేషన్‌ల మధ్య మల్టీ టాస్కింగ్, వివిధ సాఫ్ట్‌వేర్ మరిన్నింటిని నిర్వహించగలదని కంపెనీ చెబుతోంది. కంపెనీ ప్రకారం.. ఫుల్-డే బ్యాటరీని యూజర్లకు అందించగలదు.

జియోబుక్ ల్యాప్‌టాప్ ధర ఎంతంటే? :
మొత్తం మీద.. లిమిటె్ బడ్జెట్‌ను కలిగిన బ్రౌజింగ్, ఎడ్యుకేషన్, ఇతర విషయాల వంటి ప్రాథమిక ప్రయోజనాల కోసం ల్యాప్‌టాప్ కావాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. అక్టోబర్‌లో లాంచ్ అయిన (JioBook) 11.6-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియో కాలింగ్ బ్రాడ్ బెజెల్స్, ఫ్రంట్ సైడ్ 2MP కెమెరాతో వచ్చింది. Qualcomm Snapdragon 665 SoC ద్వారా పనిచేస్తుంది.

Adreno 610 GPU సపోర్టు కూడా అందిస్తుంది.  2GB RAM మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మల్టీ టాస్కింగ్ చేసుకునేలా ఉంది. 128GB వరకు విస్తరించేలా 32GB eMMC స్టోరేజీతో అందిస్తుంది. జియో ల్యాప్‌టాప్ (JioOS)లో రన్ అవుతుంది. సున్నితమైన పర్పార్మెన్స్ కోరుకునే యూజర్ల కోసం ఆప్టిమైజ్ అయిందని కంపెనీ తెలిపింది.

JioBook Laptop launched at Rs 16,499 with 100GB free cloud storage

జియో ల్యాప్‌టాప్ (JioStore)లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతిస్తుంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. జియో సింగిల్ ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు.హీటింగ్ ఇన్‌యాక్టివ్ కూలింగ్ సపోర్టు అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, Wi-Fi వంటి ఫీచర్లను కలిగి ఉంది.

ఆసక్తికరంగా, ఈ డివైజ్ ఎంబెడెడ్ Jio SIM కార్డ్‌తో వస్తుంది. Jio 4G LTE కనెక్టివిటీని అనుమతిస్తుంది. ఈ జియోల్యాప్‌టాప్ భారత మార్కెట్లో రూ. 16,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ కొత్త JioBook ల్యాప్‌టాప్ ఆగష్టు 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ అమెజాన్ ద్వారా కూడా విక్రయించనుంది.

జియోబుక్ హార్డ్‌వేర్ ఫీచర్లు :
1. అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్ : JioOS
2. 4G, డ్యూయల్-బ్యాండ్ WiFi కనెక్టివిటీ
3. అల్ట్రా స్లిమ్, సూపర్ లైట్ (990 గ్రాములు), ఆధునిక డిజైన్
4. మృదువైన మల్టీ టాస్కింగ్, పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ చిప్‌సెట్
5. 11.6” (29.46CM) యాంటీ గ్లేర్ HD డిస్‌ప్లే
6. ఇన్ఫినిటీ కీబోర్డ్, భారీ మల్టీ గెచర్ ట్రాక్‌ప్యాడ్
7. USB, HDMI, ఆడియో వంటి ఇంటర్నల్ పోర్ట్‌లు

JioOS ఫీచర్లు, స్పెషిఫికేషన్లు : 

1. 4G-LTE, డ్యూయల్-బ్యాండ్ WiFi,
2. నేచురల్ ఇంటర్‌ఫేస్
3. 75+ కీబోర్డ్ షార్ట్‌కట్స్
4. ట్రాక్‌ప్యాడ్ గెచర్స్
5. స్క్రీన్ ఎక్స్ టెన్షన్
6. వైర్ లెస్ ప్రింటింగ్
7. మల్టీ టాస్కింగ్ స్క్రీన్‌లు
8. ఇంటిగ్రేటెడ్ చాట్‌బాట్
9. Jio TV యాప్ ద్వారా ఎడ్యుకేషనల్ కంటెంట్‌కి యాక్సెస్
10. JioCloudGamesతో ప్రముఖ గేమింగ్ టైటిల్స్
11. JioBIAN రెడీ కోడింగ్ వాతావరణంతో విద్యార్థులు సులభంగా కోడింగ్ నేర్చుకోవచ్చు.
12. C/C++, Java, Python, Pearl వంటి వివిధ లాంగ్వేజీలను నేర్చుకోవచ్చు.

Read Also : YouTube Premium Subscription : యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ 3 నెలలు ఉచితం.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు