JioBook Laptop Launch : జియోబుక్ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

JioBook Laptop : జూలై 31న కొత్త జియోబుక్ లాంచ్ అవుతుందని అమెజాన్ కొత్త టీజర్ రివీల్ చేసింది. ఈ-కామర్స్ సైట్ డివైజ్ కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. లేటెస్ట్ (Jio) ల్యాప్‌టాప్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

JioBook Laptop Launch : జియోబుక్ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

JioBook laptop to launch in India on July 31, Amazon teaser reveals

JioBook Laptop : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) భారత మార్కెట్లో కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ మేరకు అమెజాన్ (Amazon) వెబ్‌సైట్‌లో ఒక టీజర్‌ను కూడా రివీల్ చేసింది. దీని ప్రకారం.. ల్యాప్‌టాప్ జూలై 31న లాంచ్ కానుందని వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్‌లో రీలాంచ్ చేసిన (JioBook) రిఫ్రెష్ వెర్షన్ కావచ్చు. లేదా రిలయన్స్ పాతదాన్ని అమెజాన్ ద్వారా కూడా విక్రయించనుంది.

రిలయన్స్ డిజిటల్ స్టోర్ల ద్వారా 2022 JioBook ల్యాప్‌టాప్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులోగా “ఆల్-న్యూ జియోబుక్” లాంచ్ అవుతుందని అమెజాన్ టీజర్ చెబుతోంది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ-కామర్స్ సైట్‌లో డివైజ్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా వెల్లడించింది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Twitter Direct Messages : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ట్విట్టర్ ఏది ఫ్రీగా ఇవ్వదు.. బ్లూ టిక్ లేకుండా DM మెసేజ్ పంపితే ఛార్జీలు తప్పవు!

గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ కొత్త JioBook ల్యాప్‌టాప్ ప్రకటించిన మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుందని అమెజాన్ టీజర్ చూపిస్తుంది. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో బ్లూ కలర్‌లో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అన్ని వయస్సుల వారికి వినోదంతో పాటు గేమింగ్ వంటి వినియోగం కోసం రూపొందించినట్టు టీజర్ పేర్కొంది. 4G కనెక్టివిటీతో పాటు ఆక్టా-కోర్ ప్రాసెసర్‌కు సపోర్టు కలిగి ఉంది.

హై-డెఫినిషన్ వీడియోల స్ట్రీమింగ్, అప్లికేషన్‌ల మధ్య మల్టీ టాస్కింగ్, వివిధ సాఫ్ట్‌వేర్ మరిన్నింటిని నిర్వహించగలదని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ జియో ల్యాప్‌టాప్ 990 గ్రాముల బరువుతో చాలా తేలికైన డిజైన్‌ను కలిగి ఉందని టీజర్ పేర్కొంది. అమెజాన్ ప్రకారం.. వినియోగదారులకు ఫుల్-డే బ్యాటరీని అందించగలదు. ప్రస్తుతానికి కొత్త జియోబుక్ ల్యాప్‌టాప్ ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలియవు. జూలై 31న లాంచ్ రోజున మిగతా ఫీచర్లు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

JioBook laptop to launch in India on July 31, Amazon teaser reveals

JioBook laptop to launch in India on July 31, Amazon teaser reveals

2022 JioBook ల్యాప్‌టాప్ అనేది పరిమిత బడ్జెట్‌, బ్రౌజింగ్, విద్య, ఇతర విషయాల వంటి ప్రాథమిక ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. ల్యాప్‌టాప్ కావాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చిన (JioBook) 11.6-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియో కాల్‌ బ్రాడ్ బెజెల్స్, ఫ్రంట్ సైడ్ 2MP కెమెరాను కలిగి ఉంది. Qualcomm Snapdragon 665 SoC ద్వారా ఆధారితమైనది. Adreno 610 GPU సపోర్టు అందిస్తుంది.

ఇందులో 2GB RAM మాత్రమే ఉంది. మల్టీ టాస్కింగ్ దీనిపై సాఫీగా ఉండదు. 128GB వరకు విస్తరించేలా 32GB eMMC స్టోరేజీతో అందిస్తుంది. Jio ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది. సున్నితమైన పర్పార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ అయిందని కంపెనీ పేర్కొంది. జియో ల్యాప్‌టాప్ (JioStore) కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

హుడ్ కింద 5,000mAh బ్యాటరీ ఉంది. రిలయన్స్ జియో ఒక్కసారి ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదని పేర్కొంది. హీటింగ్ వంటి ఇన్‌యాక్టివ్ కూలింగ్ సపోర్టు కూడా అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, Wi-Fi వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఆసక్తికరంగా, ఈ డివైజ్ ఎంబెడెడ్ Jio SIM కార్డ్‌తో వస్తుంది. Jio 4G LTE కనెక్టివిటీని అనుమతిస్తుంది. ఈ జియో ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో రూ. 20వేల లోపు నుంచి అందుబాటులో ఉండవచ్చు.

Read Also : Twitter Bird Logo : ట్విట్టర్ పిట్ట ఎగిరిపోనుంది.. కొత్త లోగో ఇదేనట.. అన్ని పక్షులకు బైబై అంటున్న మస్క్ మామ!