Twitter Bird Logo : ట్విట్టర్ పిట్ట ఎగిరిపోనుంది.. కొత్త లోగో ఇదేనట.. అన్ని పక్షులకు బైబై అంటున్న మస్క్ మామ!

Twitter Bird Logo : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి మస్క్ మామ షాకింగ్ నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ట్విట్టర్ పిట్ట లోగో త్వరలో మాయం కానుందని సంచలన ట్వీట్ చేశాడు.

Twitter Bird Logo : ట్విట్టర్ పిట్ట ఎగిరిపోనుంది.. కొత్త లోగో ఇదేనట.. అన్ని పక్షులకు బైబై అంటున్న మస్క్ మామ!

Elon Musk announces Twitter's logo change, to bid farewell to ‘all the birds’

Twitter Bird Logo : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) పిట్ట లోగో త్వరలో మాయం కానుంది. ఈ మేరకు బిలియనీర్, ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ బ్రాండ్‌గా బర్డ్ లోగో భవిష్యత్తులో ఉండదని సంచలన ట్వీట్ చేశాడు. బ్లూ బర్డ్ లోగోకు వీడ్కోలు పలికేందుకు మనమందరం సిద్ధం కావాలని మస్క్ ప్రకటించాడు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను రీబ్రాండ్ చేసేందుకు బిలియనీర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ట్విట్టర్ ఐకానిక్ బ్రాండ్ లోగోను తొలగించాలని యోచిస్తున్నట్లు మస్క్ వెల్లడించాడు. త్వరలో ట్విట్టర్ బ్రాండ్‌ నుంచి క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతామని స్పష్టం చేశాడు. ట్విట్టర్ పిట్ట లోగో స్థానంలో తగినంత మంచి (X) లోగోను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మస్క్ ట్వీట్ చేశాడు.

Read Also : Twitter Users Earn Money : మస్క్ మామ మంచోడే.. ట్విట్టర్ డబ్బులు ఇస్తోంది.. యూజర్లకు ఈ అర్హతలు ఉంటే చాలు.. ఎంత సంపాదించవచ్చు?

మస్క్ ఆల్-టైమ్ ఫేవరెట్ ‘X’ని పోలి ఉండే ఒక కొత్త గుర్తుతో సుపరిచితమైన బ్లూ కలర్ పక్షి లోగోను భర్తీ చేయాలని సూచించాడు. ట్విట్టర్‌లో రాబోయే మార్పుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి వివిధ ప్రశ్నలకు కూడా మస్క్ సమాధానమిచ్చాడు. (WOLF) అనే ట్విట్టర్ అకౌంట్ యూజర్ అడిగిన ప్రశ్నకు మస్క్.. ట్విటర్ లోగో (X)గా మార్చిన తర్వాత ట్వీట్‌కి (X) అని కొత్త పేరుగా బదులిచ్చారు. ‘X’ లోగో నచ్చితే.. సోమవారం (జూలై 24) నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని మస్క్​ ఆదివారం ట్వీట్​ చేశాడు. వాస్తవానికి (X)పై మస్క్‌కి చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ని 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనుగోలు చేశాడు. కంపెనీని (XCorp) అనే సంస్థలో విలీనం చేసాడు. మొబైల్ పేమెంట్లు, సోషల్ మీడియాతో సహా సర్వీసులను ఒకేచోట అందించే చైనా (WeChat) మాదిరిగానే ‘X ఎవ్రీథింగ్ యాప్’ అంతిమ దృష్టిని రూపొందించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. తనకు X అక్షరం అంటే చాలా ఇష్టమని, తన చేతులపై X ఆకారంలోని ఫొటోను కూడా రివీల్ చేశాడు. గత ఏప్రిల్‌లో కొత్త సీఈఓగా లిండా యాకారినోను నియమించిన తర్వాత కూడా మస్క్ ‘X’ గురించి ప్రస్తావించాడు.

Elon Musk announces Twitter's logo change, to bid farewell to ‘all the birds’

Twitter Bird Logo : Elon Musk announces Twitter’s logo change, to bid farewell to ‘all the birds’

ఈ ప్లాట్‌ఫారమ్‌ను X, ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చడానికి లిండాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశాడు. ట్విట్టర్ డొమైన్ కూడా మార్చనున్నారా? రాబోయే రోజుల్లో (Twitter.com) ఉనికిలో కొనసాగుతుందా లేదా అనేది మస్క్ క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ, డొమైన్ చాలా విలువైనది.. ట్విట్టర్ మరో డొమైన్‌కు మారడానికి కొంత సమయం పట్టవచ్చు. రీబ్రాండింగ్ విషయంలో డొమైన్ షిఫ్ట్ చాలా త్వరగా జరగవచ్చు.

X Corp కార్పొరేషన్ ఏంటి? :
ఏప్రిల్ 4న కాలిఫోర్నియాలోని కోర్టులో సమర్పించిన కోర్టు పత్రం ట్విట్టర్ స్వతంత్ర సంస్థగా ఉనికిలో లేదని సూచించింది. దాంతో కంపెనీ X Corpలో ట్విట్టర్ విలీనం చేసింది. అంటే.. Twitter Inc. X Corp.లో విలీనం అయింది. X Corp అనేది ప్రైవేట్‌గా నిర్వహించే కార్పొరేషన్. ఇది నెవాడాలో విలీనం అయింది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉందని తెలిపింది.

దీనికి సంబంధించి మార్చి 15న విలీనమైంది. ఫైలింగ్‌ల ప్రకారం.. మస్క్ కంపెనీకి అలాగే మార్చిలో క్రియేట్ చేసిన పేరంట్ కంపెనీ X హోల్డింగ్స్ కార్ప్‌కు అధ్యక్షుడుగా ఉన్నాడు. మస్క్ తరచుగా ‘ఎవ్రీథింగ్ యాప్’ అని (X)గా పిలుస్తారు. ఈ యాప్ చైనాలో పాపులర్ గో-టు యాప్ అయిన WeChat యాప్‌ మాదిరిగా ఉంటుంది.

Read Also : Twitter Direct Messages : మస్క్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడుగా.. ట్విట్టర్ ఏది ఫ్రీగా ఇవ్వదు.. బ్లూ టిక్ లేకుండా DM మెసేజ్ పంపితే ఛార్జీలు తప్పవు!