Jiophone Next Said To Run On Android 11
JioPhone Next 4G Phone : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి కొత్త 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. రిలయన్స్ జియో, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కాంబినేషన్ లో జియో 4G స్మార్ట్ ఫోన్ రాబోతోంది.. ఇది ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్.. అదే.. JioPhone Next 4G స్మార్ట్ ఫోన్.. 13MP రియర్ కెమెరాతో జియో యూజర్లను మరింత ఆకట్టుకోనుంది. చౌకైన ధరకే జియో తమ యూజర్ల కోసం 4G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టనుంది. అది కూడా రూ.4వేలకే అందించాలని కంపెనీ భావిస్తోంది.
వినాయక చవితి (సెప్టెంబర్ 10న) సందర్భంగా ఈ జియో 4G సేల్ మొదలుకానుంది. ఈ ఫోన్ రిలీజ్ కు ముందే 4G ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్లు, ధర లీక్ అయ్యాయి. జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11(Go Edition) సపోర్టుతో రన్ అవుతుంది. HD+ డిస్‌ప్లేతో పాటు సింగిల్ రియర్ కెమెరాతో రానుంది.
44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(AGM) సందర్భంగా రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇదే విషయాన్ని వెల్లడించారు. JioPhone Next ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్ కానుందని ఆకాక్షించారు. JioPhone Next స్పెసిఫికేషన్లను XDA డెవలపర్స్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్ మిషాల్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
స్పెషిఫికేషన్లు ఇవే (అంచనా) :
– 720X1,440 పిక్సెల్స్ డిస్‌ప్లే.
– క్వాల్కామ్ QM215 ప్రాసెసర్.
– 64-Bit క్వాడ్-కోర్ మొబైల్ ప్రాసెసర్
– క్వాల్కామ్ అడ్రెనో 308GPU
– బ్లూటూత్ V4.2, GPS, 1080P వీడియో రికార్డింగ్
– L PDDR3 RAM, EMM C 4.5 స్టోరేజీ సపోర్టు
– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ X5LTE Modem
– 13MP కెమెరా (బ్యాక్ సైడ్)
– ఫ్రంట్ 8MP కెమెరా (వీడియో కాల్స్)
– 4000mAh బ్యాటరీ
– ధర $50(సుమారు రూ.4,000)