Jiophone Prima 4G Launch : జియోపే యూపీఐతో జియోఫోన్ ప్రైమా 4G ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే.. ఇప్పుడే కొనేసుకోండి!

Jiophone Prima 4G Launch : జియో కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసిందోచ్.. జియోపే యూపీఐ ఫీచర్లతో జియోఫోన్ ప్రైమా ఫోన్ నవంబర్ 8 (బుధవారం)న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫీచర్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

JioPhone Prima 4G Feature Phone With JioPay UPI Launched

Jiophone Prima 4G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి కొత్త జియోఫోన్ ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో నవంబర్ 8న ఈ జియో 4G ఫోన్ లాంచ్ అయింది. గతవారమే రిలయన్స్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 (IMC)లో ఈ ప్రైమా 4జీని ప్రదర్శించింది.

ఈ కొత్త డివైజ్ బార్ ఫారమ్ ఫ్యాక్టర్‌, 2.4-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. జియోఫోన్ ప్రైమా 4జీ KaiOS ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. ఇతర జియో యాప్‌లతో పాటు వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్‌తో సహా ప్రముఖ యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. లేటెస్ట్ జియోఫోన్ 23 భాషలతో పాటు 1,800mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : JioSpace Fiber vs Starlink : అంబానీ జియోస్పేస్ ఫైబర్, మస్క్ స్టార్‌లింక్ మధ్య తేడాలేంటి? శాటిలైట్ కనెక్టివిటీ, స్పీడ్, ధర ఎంతంటే?

భారత్‌లో జియోఫోన్ ప్రైమా 4జీ ధర ఎంతంటే? :

భారత మార్కెట్లో జియోఫోన్ ప్రైమా 4జీ మోడల్ ధర రూ. 2,599కు సొంతం చేసుకోవచ్చు. సింగిల్ బ్లూ షేడ్‌లో అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్, జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. రిలయన్స్ వాస్తవానికి ఈ హ్యాండ్‌సెట్‌ను ఇటీవల ముగిసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023 ఐఎంసీలో ఆవిష్కరించింది.

జియోఫోన్ ప్రైమా 4జీ స్పెసిఫికేషన్స్ :

జియోఫోన్ ప్రైమా 4G సింగిల్ (నానో) SIM ఆప్షన్‌తో వస్తుంది. KaiOSలో రన్ అవుతుంది. ఈ ఫీచర్ ఫోన్ 240×320 రిజల్యూషన్‌తో 2.4-అంగుళాల (TFT) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఏఆర్ఎమ్ కార్టెక్స్ టీమ్ఎ53 ప్రాసెసర్‌తో పాటు 512ఎంపీ ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజీ (మైక్రో SD కార్డ్ ద్వారా)తో అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి యాప్‌లను సపోర్ట్ చేస్తుంది.

JioPhone Prima 4G Feature Phone  

జియోపే యూపీఐతో పేమెంట్లు :

జియోలో JioTV, JioCinema, JioSaavn అనే యాప్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు జియోపే యాప్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్లను కూడా చేయవచ్చు. జియోఫోన్ ప్రైమా 4జీ వెనుక భాగంలో 0.3ఎంపీ కెమెరా సెన్సార్ ఉంది. ఇందులో ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది. బ్లూటూత్ 5 కనెక్టివిటీని అందిస్తుంది. ఇంకా, 23 భారతీయ భాషలకు సపోర్టు ఇస్తుంది. 4G రెడీ ఫీచర్ ఫోన్ 1,800mAh బ్యాటరీని అందిస్తుంది. 123x56x16mm కొలతలు, 110 గ్రాముల బరువు ఉంటుంది.

జియోఫోన్ ప్రైమా సేల్ :
జియోఫోన్ ప్రైమా 4జీ ఫీచర్ ఫోన్ సేల్ కీలక రిటైల్ స్టోర్లలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలైన రిలయన్స్ డిజిటల్.ఇన్ (digital.in), జియోమార్ట్ (JioMart) ఎలక్ట్రానిక్స్ అండ్ అమెజాన్ ద్వారా కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Read Also : JioMotive Location Tracker : జియోమోటివ్ రియల్ టైమ్ కారు లొకేషన్ ట్రాకర్ ఇదిగో.. ఎవరూ దొంగిలించలేరు.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు